32.7 C
Hyderabad
March 29, 2024 12: 49 PM
Slider నెల్లూరు

సీతమ్మ చలివేంద్రం భూములపై కన్నేసిన తోడేళ్ల గ్యాంగ్

#ChandramohanReddy

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో భారీ కుంభకోణాలు జరుగుతున్నా కలెక్టర్ స్పందించకపోవడం దురదృష్టకరమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో బీద రవిచంద్ర , అబ్దుల్ అజీజ్ , బొమ్మి సురేంద్ర లతో కలిసి నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. వెంకటాచలంలో జాతీయ రహదారి పక్కన 300 ఎకరాల భూమిని అప్పట్లో ఎవరో మహానుభావులు సీతమ్మ చలివేంద్రం పేరుతో దేవాదాయ శాఖకు అప్పగించారు. ఈ భూముల ఆక్రమణలపై గతంలోనే కొందరు భక్తులు కోర్టును ఆశ్రయించారు. ఆ 300 ఎకరాలు దేవాదాయ శాఖ భూమి అని హైకోర్టు స్పష్టం చేసింది. కొన్ని అక్రమ కట్టడాలను కూడా గతంలో దేవాదాయ, రెవెన్యూ అధికారులు కలిసి పోలీసుల సహకారంతో కూల్చివేశారు.

కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రి అయిన తర్వాత ఈ విలువైన భూములను కాజేసేందుకు తోడేళ్ల గ్యాంగ్ రంగంలోకి దిగిందని చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ప్రధానంగా హైవే పక్కనే ఎకరా రూ.3 కోట్లు విలువ చేసే 75 ఎకరాల భూములపై కన్నేశారని, అధికారంలోకి వచ్చిన వెంటనే మొదట ఈ గ్యాంగ్ కాకుటూరు వద్ద హైవే పక్కనే ఉండే 60 కోట్ల విలువైన భూములను హాంఫట్ చేశారని చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆ భూకుంభకోణాన్ని మేం వెలుగులోకి తేవడంతో కేవలం కొందరిని జైలుకు పంపించి కీలకమైన తహసీల్దారు ఐఎస్ ప్రసాద్ ను మాత్రం తప్పించారని ఆయన అన్నారు. అదే ఐఎస్ ప్రసాద్ సీతమ్మ చలివేంద్రం భూమలను 2020లోనే కాకాణి బినామీల పేర్లుతో రికార్డుల్లో ఎక్కించడం మొదలుపెట్టారని, రెవెన్యూ రికార్డుల్లో అవి దేవాదాయ శాఖ భూములని స్పష్టంగా ఉన్నప్పటికీ ఆయన లెక్కచేయలేదని చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

కాకాణి ముఖ్య అనుచరుడొకరు ఆ భూములను తన తాత సొత్తులా భావిస్తూ ఇసుక డంపిగ్ కోసం బాడుగకు ఇచ్చి నెలకు రూ.2 లక్షలు వసూలు చేసుకుంటున్నాడు. ఆ భూముల్లోనే ఏడున్నర ఎకరాలను జగనన్న లేఅవుట్ గా మార్చారు.

లబ్ధిదారులకు లీగల్ గా ఆ భూమిపై హక్కు లేకుండా, కోర్టులో కేసు నడుస్తుండగానే పట్టాలు పంపిణీ చేశారు. కోర్టులో కేసులు నడుస్తున్న ఈ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టించడం ద్వారా చివరకు వారు బాధితులుగా మారే ప్రమాదముందని ఆయన అన్నారు. చుట్టుపక్కల ఉన్న మొత్తం భూమిని ఆక్రమించడానికే అక్కడ జగనన్న లేఅవుట్ వేశారు. ఈ భూకుంభకోణం మొత్తం కాకాణి అండ్ బ్యాచ్ కనుసన్నల్లోనే జరుగుతోందని చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.

పొదలకూరు తహసీల్దారుగా స్వాతి అనేక అక్రమాలకు పాల్పడిందని లోకాయుక్తకు స్టేట్మెంట్ ఇచ్చిన కలెక్టర్ ఆమెను సస్పెండ్ మాత్రం చేయలేకపోయారు. ఐఎస్ ప్రసాద్ అక్రమాలకు పాల్పడ్డారని నివేదిక ఉన్నా కాకాణి ఒత్తిడితో కలెక్టర్ చర్యలు తీసుకోలేకపోతున్నారు. కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైపోతున్నా చర్యలు తీసుకోవడానికి కాకాణి, సజ్జల భయంతో కలెక్టర్ వణికిపోతున్నారు అని ఆయన అన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నాం…ఇలాంటి అరాచకాలు, అక్రమాలు, దోపిడీలు, అధికార దుర్వినియోగం ఎన్నడూ చూడలేదు..ఎవరినీ వదిలిపెట్టేది లేదు అని ఆయన తెలిపారు.

Related posts

భారత్ బచావో ప్రదర్శనకు తెలంగాణ నుంచి 4 వేల మంది

Satyam NEWS

మూడు కేసుల్లో 32ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు స్వాధీనం ఆరుగురు స్మగ్లర్లు అరెస్టు

Bhavani

వచ్చే ఏడాది కల్లా పెద్ద సినిమా నిర్మాణ సంస్థలన్నీ దివాలా

Satyam NEWS

Leave a Comment