27.7 C
Hyderabad
March 29, 2024 02: 26 AM
Slider కరీంనగర్

సెల్ఫీ సువిసైడ్: నమ్మక ద్రోహం భరించలేక పురుగుల మందు తాగాడు

sucide

నమ్మిన స్నేహితుడు మోసం చేశాడు. భార్య చనిపోయింది. కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకెందుకు బతకాలి? ఇదే ప్రశ్న పర్కల రవి గాడ్ వేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. నా చావుకి జున్నోజు భాస్కర్ కారణం అంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. పురుగుల మందు తాగాడు.

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం ఇప్పల్ నర్సింగాపూర్ గ్రామానికి చెందిన పర్కల రవి గాడ్ దీనగాధ ఇది. ఇప్పల్ నర్సింగాపూర్ గ్రామానికి చెందిన జున్నోజు భాస్కర్ అనే ఒక బడా కోటీశ్వరుడు తన భూమిని మాయమాటలు చెప్పి కాజేశాడని రవి ఆరోపణ. న్యాయం చెప్పాల్సిన పెద్ద మనుషులు కూడా మోసం చేసే సరికి అమాయకుడైన రవి గౌడ్ గుండె తట్టుకోలేదు.

తన స్వంత వియ్యంకుడు పల్లె వీరయ్య గౌడ్, బోడ్డు మొగిలి అనే ఇద్దరు పెద్ద మనుషులు లంచాలకు తాగుడుకు అలవాటు పడి తనకు రావాల్సిన సగం వాటాకు అయిదు లక్షల రూపాయలు ఇవ్వాలని తీర్పు చెప్పారు. ఇది అన్యాయమని రవి గౌడ్ పలుమార్లు ప్రజలతో కన్నీరు పర్యంతమై చెప్పినా ఎవరూ వినలేదు.

రవి జున్నోజు భాస్కర్ మంచి మిత్రులు. ఆ నమ్మకంతో రవిని నమ్మించి తన భూమిని అగ్గువ సగ్గువ కొనుగోలు చేశాడు. మధ్యవర్తులు ఇద్దరితో కలిసి భాస్కర్ రవిఅన్న పర్కాల సమ్మయ్య గౌడ్ కి చెందిన భూమిని కూడా మోసపూరితంగా తీసేసుకున్నారట.

భార్య చనిపోయిన అనంతరం తన పెద్ద కుమారుడు కూడా ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు  రవి ఆత్మహత్య యత్నం  చేసుకోవడం ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. రవి పెద్ద కూతురును అదే పల్లె వీరయ్య గౌడ్ పెద్దకొడుకు ఇచ్చి వివాహం చేశాడు.

కొడుకు మరణించాడని వేదనలో ఉన్న రవికి చేదోడు వాదోడుగా ఉండాల్సిన వారే ఇలా ఆత్మహత్యకు ప్రేరేపించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రవికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు గౌతమ్ గత ఎనిమిది నెలల క్రితం హుస్నాబాద్ లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇప్పల్ నర్సింగాపూర్ గ్రామంలో గౌడ  సంఘం ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న పర్కాల రవిగౌడ్ తనకు జరిగిన అన్యాయంపై స్థానిక  స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే అక్కడ కూడా న్యాయం జరగలేదు. పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం తో స్నేహితుడు చేసిన ద్రోహం కన్నా ఘోరంగా అవమానంగా భావించాడు రవిగౌడ్. నేటి ఉదయం ఎనిమిది గంటలకు ఒక వీడియో విడుదల చేసి ఆత్మహత్య చేసుకోవడానికి పురుగుల మందు తాగాడు. ఆయన్ని వెంటనే స్థానిక హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారు ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేశారని తెలిసింది.

Related posts

ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభం

Bhavani

దేవునిపల్లిలో కరోనా లక్షణాలతో భారమంతా దేవుడి మీదే

Satyam NEWS

సిటి ఎ.ఆర్ ఎసిపిలుగా బాధ్యతలు స్వీకరించిన నాగయ్య, సురేంద్ర

Satyam NEWS

Leave a Comment