27.7 C
Hyderabad
April 25, 2024 09: 39 AM
Slider సినిమా

సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండిపోయిన చిరంజీవి చిన్నల్లుడు

#Kalyan Dev

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ కరోనా భయంతో తన ఇంటిలోనే ఒంటరిగా ఉంటున్నాడు. తన భార్యను, కుమార్తెను రిస్క్ లో పెట్టడం ఇష్టం లేక తాను సెల్ఫ్ క్వారంటైన్ లోనే ఉంటున్నానని కళ్యాణ్ దేవ్ వెల్లడించాడు. సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న సమయంలో తన బట్టలు తానే ఊతుక్కోవడం, తన ఆహారం తానే వండుకోవడం కూడా కళ్యాణ్ దేవ్ చేస్తున్నాడు.

ఇటీవల ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో తిరిగి షూటింగ్ లు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కళ్యాణ్ దేవ్ చిత్రం సూపర్ మచ్చి కూడా షూటింగ్ మొదలు పెట్టారు. సూపర్ మచ్చి  చిత్రం షూటింగ్ మొత్తం దాదాపుగా పూర్తి అయింది. మరో రెండు రోజుల పాటు షూటింగ్ మాత్రమే ఉంది.

ఒక పాట, టాకీ పార్టు పూర్తి అయిపోతే చిత్రం పూర్తి అయి పోతుంది. చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నందున కళ్యాణ్ దేవ్ తన ఇంటిలోనే ఒక గదిలో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండిపోయాడు. అక్కడి నుంచే షూటింగ్ లకు వెళ్లి వస్తున్నాడు. ఇదీ ముందు జాగ్రత్త అంటే.

Related posts

అమ్మ ఒడి మూడో విడత నిధులు విడుదల…

Satyam NEWS

సినిమా రివ్యూ: ఆకట్టుకున్న యండమూరి వీరేంద్రనాధ్ అతడు ఆమె ప్రియుడు

Satyam NEWS

100 లక్షల కోట్ల అప్పు చేసిన కేంద్రం తెలంగాణ పై విమర్శలా?

Bhavani

Leave a Comment