30.7 C
Hyderabad
April 19, 2024 07: 50 AM
Slider నిజామాబాద్

స్వీయ నియంత్రణ దిశగా తెలంగాణ గ్రామాలు

#selflockdown

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాలలో చుట్టుపక్కల మండలాల్లో కరోనా వైరస్  బాధితుల సంఖ్య అమాంతంగా పెరుగుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు.

మళ్లీ పాజిటివ్ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది తగ్గుముఖం పట్టే అవకాశాలు కనబడడం లేదు. డబ్బున్నవారు నిజామాబాద్ హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణిస్తే వారికి అంబులెన్స్లో తీసుకువచ్చి దహన సంస్కారాలు చెప్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఆయా మండలాలతో పాటు ఆయా గ్రామాలలో ఎవరికివారు సెల్ప్ లాక్డౌన్ ప్రకటించుకున్నారు

మరికొన్ని గ్రామాల్లో వారాంతపు సంత లు సైతం రద్దు చేసుకుంటున్నారు. కానీ మహమ్మారి ఏవిధంగా వస్తుందో తెలియని పరిస్థితి దాపురిస్తుంది. దీనిపై సంబంధిత అధికారులు గానీ గ్రామపెద్దలు గాని స్పందించి పాజిటివ్ బాధితులకు గతంలో మాదిరిగా ఏదైనా ప్రభుత్వ భవనంను ఉపయోగించి వారికి ఒకేచోట మెరుగైన  వైద్య సేవలతో పాటు పౌష్టికాహార౦ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

గతంలో భూమి ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ    లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ సంస్థ ప్రతినిధులు నిరుపేదలకు ఎంతోమందికి ఆకలి  తీర్చారు.ఇప్పుడు కూడా తాము సేవా కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు అంటున్నారు.కానీ అన్ని గ్రామాలకు వెళ్లి వారి సేవ చేయడం కొంత ఇబ్బందిగానే ఉంటుంది దీనిపై  గ్రామపెద్దలు అధికారులు  పాజిటివ్ బాధితులను  ఓ ప్రభుత్వ భవనంలో వసతి కల్పించి వీరి సేవలను వినియోగించుకోవాలని పలువురు మేధావులు యువకులు బహిరంగంగానే తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

లాలయ్య, సత్యం న్యూస్

Related posts

మరింత భద్రత కోసం త్వరలో ఇ-పాస్‌పోర్ట్‌లు

Satyam NEWS

భాజపా ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ

Satyam NEWS

ప్రభుత్వ ఉగ్రవాద చర్యల పై చంద్రబాబు దీక్షకు మద్దతు

Satyam NEWS

Leave a Comment