35.2 C
Hyderabad
April 20, 2024 16: 18 PM
Slider వరంగల్

విద్యార్థులే పాఠాలు బోధించిన వేళ

#selfday

శనివారం రోజున ములుగు జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం జరగగా అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్నం విజయమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశం లో ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులు వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ రకంగా పాఠశాల జీవితంలో ఉపాధ్యాయులుగా వ్యవహరించడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని విద్యార్థులు తెలిపారు.

ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఈరోజు కార్యక్రమం విజయవంతం కోసం ఎటువంటి పక్కా ప్రణాళికతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారో అదేవిధంగా జీవితంలో కూడా ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించడం కోసం పక్కా ప్రణాళిక ఏర్పాటు చేసుకొని లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.

విద్యాబోధనలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం క్యాతం రాజేందర్, పిట్టల మల్లయ్య, బానోతు దేవ్ సింగ్, శిరుప సతీష్ కుమార్, తోట చంద్రమౌళి, గుండేటి మమత, సంఘ చేరాలు పోరిక వసంత, శివ శివనాథుని శారద, బైకానీ రజిత విద్యార్థులు పాల్గొన్నారు

Related posts

గిరిజనులకు అండగా నిలిచేందుకు మెగా వైద్య శిబిరం

Satyam NEWS

తెలంగాణకు మరో జాతీయ అవార్డు

Bhavani

గాంధీభవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన ఉత్తమ్

Satyam NEWS

Leave a Comment