30.3 C
Hyderabad
March 15, 2025 10: 41 AM
Slider ప్రత్యేకం

సెల్ఫీ పాయింట్: నేను మూర్ఖుడిని మరి మీరో?

Chityala Police

కొడితే వద్దంటారు. చెబితే వినరు ఏం చేయాలి? కరోనా కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించిన ప్రభుత్వాలు ఆ బాధ్యత మొత్తం పోలీసులపై తోశాయి. పోలీసులు ప్రజల్ని కంట్రోల్ చేయలేక నానా పాట్లు పడుతున్నారు. అవగాహన ఉన్న వాళ్లు బయటకు రావడం లేదు కానీ అల్లరి చిల్లరగాళ్లు మాత్రం తిరుగుతూనే ఉన్నారు. అత్యవసర పని ఉందంటూ బైకులపై బలాదూర్ తిరిగే వాళ్లను కొట్టకుండా తిట్టకుండా కంట్రోల్ చేసే ఉపాయాన్ని తెలంగాణ రాష్ట్ర చిట్యాల పోలీస్ లు కనిపెట్టారు.

ఈ బోర్డు పెట్టిన తర్వాత రోడ్డు పైకి వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందట. లాక్ డౌన్ ఉల్లంఘించి బయట తిరుగుతున్న వ్యక్తులను ఇలా సెల్ఫీ పాయింట్ దగ్గర ఫోటో  తీయించి సదరు వ్యక్తి ఫోన్లోని వాట్స్అప్ స్టేటస్ లో అప్లోడ్ చేస్తున్నారు… దెబ్బకి బయట తిరిగే వాళ్ళ ఈ సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ ఐడియా ఎవరిదో గానీ వారికి హ్యాట్సాఫ్.

Related posts

చంద్రబాబుకు హాండ్ ఇచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలు

Satyam NEWS

పౌరసరఫరాల సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయండి

mamatha

లోన్ బర్డెన్: పెరుగుతున్న వ్యాపారవేత్తల ఆత్మహత్యలు

Satyam NEWS

Leave a Comment