39.2 C
Hyderabad
March 29, 2024 16: 49 PM
Slider ఖమ్మం

6న ఆర్ధిక సంక్షోభం పై సెమినార్

#poster

ఫాసిజం,  ఆర్ధిక సంక్షోభం అంశాలపై ఈ నెల 6వ తేదీన  ఖమ్మం లో  సెమినార్ నిర్వహిస్తున్నట్లు పౌరవ హక్కుల జిల్లా కార్యదర్శి విప్లవ కుమార్, పిడిఎస్ యు  జిల్లా ప్రధాన కార్యదర్శి జి మస్తాన్ పేర్కొన్నారు.  ఇందుకు సంబందించి జిల్లా కోర్టు ఆవరణలో పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ  నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం  గత ఎనిమిది సంవత్సరాలుగా దేశాన్ని ఏలుతున్నదని, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు,  మేధావులను మోడీ ప్రభుత్వం నిర్భందాలకు గురిచేస్తుందన్నారు. ప్రజావ్యతిరేక  ఆర్థిక విధానాలను అవలంబిస్తూ అవే పెద్ద సౌభాగ్య వెలుగు దీవెనలు అంటూ ప్రచారాలు బాటాలు ఉదుకోవడం మోడీ చేస్తుండన్నారు.  

తప్పుడు ఆర్ధిక విధానాల వలన రూపాయి విలువ రోజురోజుకీ దిగజారిపోతుందన్నారు. 2016 నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దు చేశారు. ఇది ఒక భారీ కుట్ర ప్రయోగం అన్నారు.  సంపద చట్టబద్ధం చేసుకోవడానికి దివాళా తీసిన బ్యాంకులకు సేవ కల్పించడానికి, ప్రజల సొమ్ముతో బ్యాంకులు ఖజానా నింపి కార్పొరేట్లకు రుణాలు ఇవ్వడానికి, నోట్ల మార్పిడీ ఉపయోగపడిందన్నారు.  మతోన్మాదం,  ఫాసిజం, ఆర్ధిక సంక్షోభం తదితర అంశాలపై విద్యార్ధి, యువజన సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సెమినార్ కు ఇఫ్టు  జాతీయ కార్యదర్శి  ఇప్టూ ప్రసాద్,  స్పర్శ అధ్యయన వేదిక వ్యవస్థపకులు కాకి భాస్కర్,  సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్,  తెలంగాణా ప్రోగ్రెసీవ్ టీచర్స్ ఫెడరేషన్   రాష్ట్ర నాయకులు తాళ్ళూరి వేణు తదితర మేధావులు పాల్గొని ప్రసంగిస్తారన్నారు.

Related posts

మహబుబ్ నగర్ లో అధునిక కరోనా వైరస్ టెస్టింగ్ ల్యాబ్

Satyam NEWS

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం

Satyam NEWS

విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయిస్తూ ఉత్తర్వులు

Satyam NEWS

Leave a Comment