31.2 C
Hyderabad
April 19, 2024 05: 41 AM
Slider ముఖ్యంశాలు

సీనియర్ నటి జమున కన్నుమూత

#jamuna

సీనియర్‌ నటి జమున ఇకలేరు. హైదరాబాద్‌లో  ఆమె నివాసంలో తెల్లవారుఝామున కన్నుమూశారు. జమున 1936 ఆగస్ట్‌ 30న హంపీలో జన్మించారు. తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేశి. జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. ఆమె తొలిచిత్రం పుట్టిల్లు. రామారావు, అక్కినేని, జగ్గయ్య వంటి అలనాటి అగ్రహీరోల సరసన నాయికగా నటించింది. ఎన్ని పాత్రల్లో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్ర సత్యభామ క్యారెక్టరే. ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేమన్నట్టుగా జీవించారు. జమున పుట్టిల్లు తో తెరంగేట్రం చేశారు. సత్యభామా కలాపంతో ప్రేక్షక జన హృదయాల్లో విహరించారు. చిన్ననాటి నుంచే నాటకాలతో నటనకే ఆభరణంగా మారాారు. తర్వాత అంచలంచలెగా ఎదిగి 198 ల్లో నవరసనటనా సామర్ధ్యం కనబరిచారు. దక్షిణాది భాషలన్నటితో పాటు.. పలు హిందీ ల్లోనూ నటించి భళీ అనిపించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. జమున చిన్నతనం నుండే నాటకాలలో నటించేవారు. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనీయంలలో శిక్షణ ఇప్పించారు. మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించగా, ఆమె అభినయం నచ్చి ఆమెకు పుట్టిల్లు (1953)లో నటిగా అవకాశం ఇచ్చారు. తెలుగు, దక్షిణభారత భాషల్లో కలిపి ఆమె 198 లు చేశారు. పలు హిందీ లలో కూడా నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ , 1964లో విడుదలైన మూగ మనసులు లకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి 25సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారామె. 1980లలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్ సభకు ఎంపిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయల నుండి తప్పుకున్నా, 1990వ దశకంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేశారు.

Related posts

దేవనార్ అంద పాఠశాలకు చైతన్య ఫౌండేషన్ వితరణ

Satyam NEWS

గుడ్ వర్డ్: అక్షరాస్యతతోనే సమాజం అభివృద్ధి

Satyam NEWS

యువకుడు మృతి

Murali Krishna

Leave a Comment