అలనాటి అందాల నటి గీతాంజలి కన్నుమూశారు. నేటి తెల్లవారుజామున గుండె పోటుతో హైదరాబాద్ లోని ఫిలింనగర్ లోని అపోలో ఆసుపత్రిలో ఆమె మరణించారు. కాకినాడలో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి. దాదాపుగా 500 చిత్రాలలో నటించిన గీతాంజలి 1961లో సీతారామకళ్యాణం అనే చిత్రంతో ఆరంగేట్రం చేశారు. ఎన్ టి రామారావు గీతాంజలిని చిత్ర రంగానికి పరిచయం చేశారు. తెలుగు, తమిళం, మలయాళం చిత్రాలలో గీతాంజలి నటించారు. డాక్టర్ చక్రవర్తి, లేత మనసులు, బొబ్బిలి యుద్ధం, దేవత, లేత మనసులు, గూఢచారి 116, సంబరాల రాంబాబు లాంటి సూపర్ హిట్ చిత్రాలలో గీతాంజలి నటించారు. సినీ హీరో అయిన రామకృష్ణ ను ఆమె వివాహమాడారు. వివాహం అయిన తర్వాత ఆమె చిత్రపరిశ్రమకు దూరం అయ్యారు. ఆ తర్వాత మళ్లీ క్యారెక్టర్ యాక్టర్ గా నటించడం ప్రారంభించారు. దటీజ్ మహాలక్ష్మి చిత్రంతో ఆమె మళ్లీ చిత్రాలలో నటించడం ప్రారంభించారు.
previous post