28.7 C
Hyderabad
April 20, 2024 05: 32 AM
Slider క్రీడలు

ఉత్సాహంగా శ్రీకాకుళం జిల్లా స్థాయి సీనియర్ ఫెన్సింగ్ పోటీలు

#fencing

శ్రీకాకుళం నగరంలోని టౌన్ హాల్ వేదికగా ఆదివారం జిల్లా స్థాయి సీనియర్ ఫెన్సింగ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఈ పోటీలను పకడ్భందీ ఏర్పాట్ల నడుమ నిర్వహించారు. ఈ పోటీలను ప్రముఖ న్యాయవాది,సీనియర్ క్రీడాకారుడు ఎన్ .విజయ్ కుమార్ ,వ్యాపార వేత్త బలభద్రుని రాజా, నారాయణశెట్టి కిరణ్ కుమార్ ,రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి తైక్వాండో శ్రీను,ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వైశ్యరాజు మోహన్ ఇతర ప్రముఖులతో కలిసి ప్రారంభించారు.

సీనియర్స్ విభాగంలో పురుషులు,మహిళలకి వేర్వేరుగా ఈ పోటీలను నిర్వహించారు. ఈ పటీలక్రీడాకారులంతా ఈ పోటీలలో పాల్గొని వారి ప్రతిభను చాటారు. క్రీడలకి ఉన్నత చదువులలో ఉన్న ప్రత్యేక కోటాను సద్వినియోగం చేసుకునేలా క్రీడాకారులు రాణించాలని ప్రముఖ న్యాయవాది,సీనియర్ క్రీడాకారుడు  ఎన్ .విజయ్ కుమార్  పిలుపునిచ్చారు. నిరంతరం సాధన చేయడం ద్వారా రాష్ట్ర,జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచి మెడల్స్ సాధించడంతో పాటుగా భవిష్యత్ కి బాటలు వేసుకోవాలని సూచించారు.

జిల్లా స్థాయి సీనియర్ ఫెన్సింగ్ పోటీలు ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ గెలుపు,ఓటములను ప్రక్కన పెట్టి ప్రతి ఒక్క క్రీడాకారుడు నిరంతరం సాధన చేయాలన్నారు. శిక్షకుల వద్ద మెలకువలను నేర్చుకుని క్రీడా పోటీలలో రాణించాలని సూచించారు. జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ చూపిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో కూడా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జి.వెంకటేశ్వరరావు,ఎం.సుధీర్ వర్మ, సంపతిరావు నాయుడు,గురుగుబెల్లి ప్రసాద్ ,బెవర జ్యోతి ప్రసాద్ ,టంకాల కృష్ణ,రవికుమార్,తైక్వాండో గౌతమ్ ,నవీన్ ,కిరణ్ ,పి,చంటి తదితరులు పాల్గొన్నారు.

Related posts

రోడ్డు ప్రమాద బాధితుడిని పరామర్శించిన జూపల్లి

Satyam NEWS

మట్టపల్లి శ్రీ లక్ష్మీనృసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

ఇసుక అక్రమ రవాణా అంశం లో అధికారుల సస్పెన్షన్

Satyam NEWS

Leave a Comment