27.2 C
Hyderabad
October 21, 2020 18: 17 PM
Slider సినిమా

న్యాయస్థానాలపై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు

#Roja

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా హైకోర్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి భూకుంభకోణంలో ఓ లాయర్‌పై కేసు వేస్తే హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం దారుణమన్నారు.

అలాగే అమరావతి కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేస్తే టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, ఆయన బినామీలు గజగజా వణుకుతున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు.

ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో భారీ కుంభకోణం జరిగింది. రాజధాని పేరుతో బాబు, ఆయన బినామీలు వేల ఎకరాలు కొనుగోలు చేశారు.

టీడీపీ పాలనలో పెద్ద కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణం మీద ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేస్తే గజగజ వణుకుతున్నారు అని ఎమ్మెల్యే రోజా అన్నారు.

భూకుంభకోణానికి సంబంధించి అన్ని ఆధారాలతో ఏసీబీ కేసు నమోదు చేసిందన్నారు. అమరావతిలో భారీ కుంభకోణం జరిగిందని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని వెల్లడించారు.

చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నారని ప్రధాని చెప్పారని గుర్తు చేశారు. కానీ, చంద్రబాబు మాత్రం ఇప్పుడు తేలుకుట్టిన దొంగలా ఉన్నారన్నారు.

Related posts

ఫారెస్టు డిస్ట్రాక్షన్: ఇక్కడ మొక్కల రక్షణ అక్కడ అడవుల భక్షణ

Satyam NEWS

జీవో కేవలం క్రిమినల్ చర్యలకు ఉద్దేశించింది కాదు

Satyam NEWS

ఆకలి దేవోభవ

Satyam NEWS

Leave a Comment