గత వైఎస్సార్పీ ప్రభుత్వం పేదలకు మంజూరు చేసే ఇండ్ల జాబితాను మార్పు చేసిందంటూ విజయనగరం కూటమి ఎమ్మెల్యే ఆదితీ అన్నారు. విజయనగరం సారిపల్లి, సోనియా నగర్ వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్లను విజయనగరం ఎమ్మెల్యే ఆదితీతో కలిసి కలెక్టర్ డా. బీ. ఆర్. అంబేద్కర్ కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఇండ్లకు కావలసిన, అవసరమైన వసతులు ను కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇక కట్టిన టిడ్కో ఇండ్ల జాబితాను గత ప్రభుత్వం మార్చేసిందని కూటమి ఎమ్మెల్యే ఆదితీ సంచలనమైన ఆరోపణలు చేశారు. అస్సలు ఈ ఇండ్లను మంజూరు చేసిందే గతంలో చంద్రబాబు ప్రభుత్వమని అన్నారు. ఇంకా ఎమ్మెల్యే ఏం మాట్లాడిందో “సత్యం న్యూస్. నెట్ ” అందిస్తోంది చూడండి.
previous post