36.2 C
Hyderabad
April 25, 2024 22: 32 PM
Slider వరంగల్

వితంతువులకు ప్రత్యేక మహిళాశాఖ ఏర్పాటు చేయాలి

#WomenPower

వితంతు, ఒంటరి మహిళా కుటుంబాల అభ్యున్నతి కోసం ప్రత్యేక మహిళా శాఖ ఏర్పాటుతో పాటు ప్రత్యేక చట్టాలు రూపొందించి అమలు చేయాలని వితంతు ఒంటరి మహిళా సమస్యల సాధన సంక్షేమ సంఘం నిర్వాహకుడు సంద బాబు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్రీవెన్స్ కు ఆన్ లైన్ ద్వారా వినతిని పంపించారు.

వితంతు ఒంటరి మహిళల జీవన పరిస్థితి అన్ని రాష్ట్రాల్లోనూ ప్రశ్నార్థకంగా మారిందని, వీరి కుటుంబాలు సమాజంలో అన్ని రంగాల్లో, అన్ని స్థాయిల్లో వెనుకబడి ఉండటం వల్ల అన్ని రకాల దోపిడి, పీడనలకు అణచివేతలకు, అత్యాచారాలకు,ఆత్మహత్యలకు గురి అవుతున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన సంక్షేమ పథకాలు అందకపోవడంతో మరింత కుంగుబాటుకు గురవుతున్నారని,  బంగారు భవిష్యత్తు కలిగిన వారి పిల్లలు అసాంఘీక శక్తులుగా మారి వారు దౌర్భాగ్య స్థితిలో మగ్గుతున్నారని , వితంతు మహిళలకు ప్రత్యేక మహిళాశాఖ ఏర్పాటు చేయడం వల్ల వారు ఆర్థిక సాధికారితతో  పాటు, సమానావకాశాలు, పూర్తిస్థాయి భాగస్వామ్యం, సంకల్పం దిశగా వారి హక్కులు గైకొని విద్య, వైద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో సమాజాభివృద్ధిలో వితంతు మహిళలు భాగస్వామ్యం పెంచుకుంటారని, అప్పుడు ప్రకాశవంతమైన నక్షత్రాలుగా ఎదుగుతారని గ్రీవెన్స్ కు పంపిన వినతిలో సంద బాబు పేర్కొన్నారు.

Related posts

గుంటూరులో క్యాష్ వ్యాన్ నుంచి భారీ చోరీ

Satyam NEWS

రోజూ వేధిస్తున్న కొడుకును చంపేసిన తండ్రి

Satyam NEWS

పోలీసు సిబ్బంది ధైర్యంగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి

Satyam NEWS

Leave a Comment