40.2 C
Hyderabad
April 19, 2024 17: 44 PM
Slider ఖమ్మం

జల్సాల కోసం చోరీలు చేసిన నిందితుడు అరెస్ట్

#khammampolice

జల్సాల కోసం నేర ప్రవృత్తిని ఎంచుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు ఖమ్మం టూటౌన్ సీఐ శ్రీధర్ వెల్లడించారు. టౌన్ ఏసీపీ అంజనేయులు ఆదేశాల మేరకు ఈరోజు వాహన తనిఖీలో భాగంగా  నగరంలోని NTR సర్కిల్ వద్ద గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ముందు అనుమానాస్పదంగా కనిపించిన నిందుతుడి అదుపులోకి తీసుకొని  వివరాలు సేకరించినట్లు సిఐ తెలిపారు.

కృష్ణాజిల్లా, పెనమలూరు మండలం,పొరంకి గ్రామానికి చెందిన నిందుతుడు దెందుకూరి గణేష్ (25) తన తండ్రి మరణం ఆనంతరం ఆర్ధిక పరిస్థితులు బాగలేక బతుకుదేరువు కోసం సమీప బందువుల ద్వారా 6 నెలల క్రితం  ఖమ్మం నగరంలోని  మామిళ్లగూడెంలోని బస్ డిపో రోడ్, బుర్హన్ పూరం ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొన్నాడు.

నగరంలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో OT అసిస్టెంట్ గా చేరి జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వాళ్ళు ఇచ్చే జీతం తన జల్సాలకి సరిపోకపోవడం వల్ల ఏదైనా దొంగతనం చేసి అధిక మొత్తంలో డబ్బు సంపాదించాలని నేర ప్రవృత్తిని ఎంచుకుని నేరాలు  మొదలుపెట్టాడు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు.

హాస్పిటల్ లో పని చేస్తున్న క్రమంలో అక్కడికి వచ్చే రోగులు, వారి బంధువుల వద్ద నుండి డబ్బులు దొంగతనాలు చేయడం అవి సరిపోక  సుమారు 7 రోజుల క్రితం తాను గతంలో పనిచేసిన హాస్పిటల్ కు వెళ్లి అక్కడ డాక్టర్ గా నటిస్తూ.. తిరుగుతూ ఉండగా… ఒక డాక్టర్ గారు తన కారు యొక్క తాళం చెవిని తన టేబుల్ మీద పెట్టి హాస్పిటల్ లో రౌండ్స్ కి వెళ్లగా తాళంచెవి తీసుకొని  హాస్పిటల్ ముందు పార్క్ చేసిన మారుతి సెలెరియో కారును దొంగలించి నిందితుడి ఇంటి దగ్గర ఉన్న సందులో దాచి ఉంచాడు. అదేవిధంగా  మరుసటి రోజు డాక్టర్ గా నటిస్తూ ఖమ్మంలోని మరో హాస్పటల్ కు రాత్రి సుమారు 07.30 గంటల సమయంలో వెళ్లి, అక్కడ రోగుల పరిశీలిస్తున్నట్లుగా నటిస్తూ, అక్కడి నుండి 1 సెల్ ఫోన్ ను దొంగిలించాడు.అదే రోజు రాత్రి సమయంలో  ఖమ్మం బైపాస్ రోడ్ లో గల  కార్ ట్రావెల్స్ ముందు పార్క్ చేసిన కారును ట్రావెల్స్ ఆఫీస్ యొక్క డోర్ తాళం పగలకొట్టి ప్రింటర్ ను దొంగతనం చేశాడు.

తదనతరం మరుసటి రోజు ఉదయం ఖమ్మం గవర్నమెంట్ హాస్పటల్ కు వెళ్లి, అక్కడ రోగుల పరిశీలిస్తున్నట్లుగా నటిస్తూ, రోగుల యొక్క బంధువుల దగ్గరినుండి 3 సెల్ ఫోన్ లు దొంగిలించి ఇంటికి వెళ్లి దొంగిలించిన కార్ లో దాచి ఉంచాడని . ఈ కార్లు మరియు  సెల్ ఫోన్ లను విజయవాడకు తీసుకువెళ్లి అమ్ముదాం అనుకొని, ఈరోజు దొంగిలించిన కారులో ప్రింటర్ మరియు నాలుగు సెల్ ఫోన్ లను తీసుకొని వెళ్తుండగా ఈరోజు ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో నిర్వహిస్తున్న వహనాలలో తనిఖీలో అనుమానాస్పదంగా కనిపించడంతో  అదుపులోకి తీసుకొని విచారించగా నిందుతుడు వాస్తవాలు వెల్లడించినట్లు, సూమరు 10 లక్షల విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ  తెలిపారు.

Related posts

కాపీ క్యాట్: 2 వేల నోటుపై సెక్యూరిటీ ఫీచర్లు డొల్లే

Satyam NEWS

ఆసుపత్రి వ్యర్ధాలను నియంత్రించాలి

Satyam NEWS

ఒవైసీ సభలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు

Satyam NEWS

Leave a Comment