27.7 C
Hyderabad
April 24, 2024 09: 45 AM
Slider గుంటూరు

కొత్త నాటకం: సర్వర్లు కావాలనే డౌన్

రిజిస్ట్రేషన్ల ఆదాయంపై కన్నేసిన ఏపి ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాంకేతిక సమస్యలతో రాష్ట్ర వ్యాప్తంగా భూమి రిజిస్ట్రేషన్ లు నిలిచిపోయినట్లు చెబుతున్నా కావాలనే ఈ విధంగా చేశారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో భారీ ఎత్తున భూముల విలవ పెంచాలని నిర్ణయించుకున్నారు.

భూముల విలువ పెంచడం వల్ల రిజిస్ట్రేషన్ చార్జీలు గణనీయంగా పెరిగి రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతుంది. కొత్త జిల్లా హెడ్ క్వార్టర్స్ మినహా మిగిలిన ప్రాంతాలలో భూముల మార్కెట్ విలువ 25 నుంచి 30 శాతం వరకూ పెంచబోతున్నారు. కొత్త జిల్లా హెడ్ క్వార్టర్స్ లో గత ఏడాదే భారీగా భూముల మార్కెట్ ధరలు పెంచారు. కొన్ని చోట్ల భూముల విలువ పెంపు దాదాపు 50 శాతం వరకూ ఉంది. ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే సబ్ రిజిస్టర్ కార్యాలయాల పరిధులను గుర్తించి ఆయా ప్రాంతాలలో భారీ ఎత్తున భూ విలువ పెంచుతున్నారు. జూన్ 1 నుంచి మార్కెట్ ధర పెరుగుతున్న నేపథ్యంలో భూ రిజిస్ట్రేషన్ లు భారీ ఎత్తున పెరిగాయి. గత రెండు మూడు రోజులుగా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరుగుతున్న సమయంలో సర్వర్ సమస్యలు వచ్చాయని చెబుతున్నారు.

సోమవారం ఉదయం 11.30 కి రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్ సమస్య తలెత్తింది. ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో నిన్నటి(సోమవారం) నుంచి సర్వర్లు మొరాయిస్తున్న పరిస్థితి. అయితే ఈరోజు కూడా సర్వర్లు అందుబాటులోకి రాకపోవడంతో… రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద‌ పడిగాపులు పడుతున్నారు.

గత ఏడాది అర్బన్ పరిధిలో పది నుంచి పదిహేను శాతం పెంచగా.. ఈ ఏడాది రూరల్ పరిధిలో కూడా రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఈ క్రమంలో పెంపు‌ భారంతో ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వస్తున్నారు. అయితే కావాలనే సర్వర్లు ‌పని‌చేయకుండా‌ చేశారని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

రాంచరణ్, ఉపాసన లకు కూతురు

Bhavani

సర్పంచ్ కుమారుడికి మేడిపల్లి సత్యం పరామర్శ

Satyam NEWS

కరోనా కారణంగా జుమా నమాజ్ ఇంటిలోనే ఆచరించాలి

Satyam NEWS

Leave a Comment