30.7 C
Hyderabad
April 24, 2024 02: 22 AM
Slider రంగారెడ్డి

మానవసేవయే మాధవ సేవ: లీవ్ అండ్ లెట్ లీవ్ సంస్థ

#LiveAndLetLive

మానవ సేవయే మాధవ సేవ అంటూ లీవ్ అండ్ లెట్ లీవ్ సంస్థ ప్రస్తుతం చలి కాలం కావడంతో  ఆ సంస్థ ప్రతినిధులు రంగారెడ్డి జిల్లా ఆమన గల్లు మున్సిపాలిటీ పరిధిలోని నుచు గుట్ట తండా లో పేద వృద్ధులకు దుప్పట్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఆ సంస్థ సభ్యుడు కూన సతీష్ కుమార్ మాట్లాడుతూ తమకు కలిగిన దాంట్లో పేద ప్రజలను ఆదుకోవాలని ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించిన ట్లు ఆయన పేర్కొన్నారు.

సంస్థ  స్థాపించినప్పటి నుండి తెలంగాణ రాష్ట్ర నిరుపేద కుటుంబాలకు అభయ హస్తం గా మారిందన్నారు. దినదిన ప్రవర్ధమానంగా  గుర్తింపు పొందుతుంది అని, కల్వకుర్తి  నియోజకవర్గ మే కాకుండా రాష్ట్ర స్థాయిలో తమ సంస్థ  ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, ఆయన పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన కరోనా మహమ్మారి వ్యాధిని అరికట్టేందుకు సంస్థ ద్వారా మాస్కులు,శానిటైజర్లు, పంపిణీ చేసామని తెలిపారు.

అదేవిధంగా  కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో విపత్కర సమయంలో పేద ప్రజలు తిండికి లేక ఇబ్బందులు పడకుండా లీవ్ అండ్ లెట్ లీవ్ సంస్థ ద్వారా సుమారు 450 మంది పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందచేశామన్నారు.

కరోనా  వ్యాధి బారిన పడకుండా ఉండడానికి ముందస్తు జాగ్రత్తగా సంస్థ ద్వారా వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి ఇమ్యూనిటీ బూస్టర్ మందులను పంపిణీ  చేశామన్నారు.

సేవే లక్ష్యంగా నూతన ఉత్సాహంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్న లీవ్ అండ్ లెట్ లీవ్ సంస్థ సభ్యులకు గ్రామ మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులు మేధావులు అభినందించారన్నారు.

లీవ్ అండ్ లెట్ లీవ్ సంస్థకు నరేందర్ చరవాణి  ద్వారా  నుచుగుట్ట తండాలో ఉన్న పేద వృద్ధులకు సహాయం చేయాలని విన్నవించగా ఆయన కొరికమేరకు తండాకు వచ్చామన్నారు.

ప్రతి ఒక్కరు మానవసేవయే మాధవసేవ అని, పరోపకారం  చేయాలని సూచించారు.

ఎవరికైనా మందులు, దుప్పట్లు, కావలసినవారు ఏదైనా సహాయం పొందాలనుకునే పేద ప్రజలు లీవ్ అండ్ లెట్ లీవ్ సంస్థ సభ్యులు కూన సతీష్ -8106526863, మొహమ్మద్ ఖలీల్ 9703793337, కొండూరి రమణ, ఖలీల్ వీరిని నేరుగా గాని చరవాణి ద్వారా గాని సంప్రదించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Related posts

సాయంత్రం తెరుచుకున్న అయ్యప్ప ఆలయ ద్వారాలు

Satyam NEWS

డముకు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: 4గురి మృతి

Satyam NEWS

కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్‌!

Sub Editor

Leave a Comment