రెండో రోజు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆధ్వర్యంలో ఘనంగా సేవా సప్తాహ కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహిస్తోన్న సేవా సప్తాహ కార్యక్రమం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఘనంగా సాగుతోంది. నిజామాబాద్ ఎంపీ గౌరవ అర్వింద్ ధర్మపురి ఆధ్వర్యంలో రెండో రోజు భీంగల్ లో భారీ ఎత్తున ఉచిత హెల్త్ క్యాంప్ కార్యక్రమం సాగింది. వేయి మందికి పైగా ప్రజలు ఈ క్యాంప్ ద్వారా ఉచిత వైద్యసాయం పొందారు. నిజామాబాద్ బస్వా గార్డెన్స్ లో జరిగిన రక్తదాన శిబిరంలో రెండు వందలకు పైగా యువకులు, మహిళలు కూడా ఉత్సాహంగా రక్తదానం లో పాల్గొన్నారు. ఈ నెల 20 వరకు సేవా సప్తాహ కార్యక్రమం సాగనుంది.
previous post
next post