కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పోలీసు స్టేషన్ సబ్ ఇనస్పెక్టర్‌గా నియమితులైన రాజును వివిధ సంస్థలకు చెందిన నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను కలిసిన వారిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాల మహానాడు సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్, మాల మహానాడు ప్రధాన కార్యదర్శి ఎల్దాసరి అంజయ్య తడగొండ లక్ష్మణ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్ తడగొండ నర్సింబాబు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రాజు మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
previous post