35.2 C
Hyderabad
April 20, 2024 18: 19 PM
Slider వరంగల్

మహిళా ఆశ్రమానికి కుట్టు మిషన్ల పంపిణీ

#anurag

హనుమకొండ లోని స్వధార్ మహిళా ఆశ్రమానికి అనురాగ్  హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్, మాజీ CWC చైర్ పర్సన్  డా.కె.అనితారెడ్డి కుట్టుమిషన్ లు అందచేశారు. మహిళలు ఆర్ధికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమౌతుందని ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి  అన్నారు. శిక్షణ పొందిన మహిళలకు  కుట్టు మిషన్ లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా అనితా రెడ్డి మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధితో రాణించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని నైపుణ్యలను పెంచుకోవాలని తెలిపారు. మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు ప్రయత్నించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితా రెడ్డి, శైలజ, అరుణజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Related posts

పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి

Satyam NEWS

బాధితుల గోడును సావ‌ధానంగా విన్న లేడీ పోలీస్ బాస్…!

Satyam NEWS

అడవుల రక్షణకు పెద్దపులి సంరక్షణ అవసరం

Satyam NEWS

Leave a Comment