28.7 C
Hyderabad
April 24, 2024 06: 33 AM
Slider విజయనగరం

ఉపాధి కోల్పోయిన మ‌హిళ‌ల‌కు…స్వచ్చంద సంస్థ చేయూత‌

#Vijayanagaram S P

దాదాపు 11 నెల‌లుగా క‌రోనా మూలంగా జీవనోపాధి కోల్పోయిన మ‌హిళ‌ల‌ను  ఆర్దికంగా నిల‌బెట్టేందుకు మౌంట్ ఫోర్ట్ సోష‌ల్ ఇన్ స్టిట్యూట్..ముందుకు వ‌చ్చింది.

ఉపాది లేకుండా త‌మ బిడ్డ‌ల‌ను చ‌దివించుకోలేని మ‌హిళ‌ల‌కు ఆ భ‌రోసాను క‌ల్పించే చ‌ర్య‌లు చేపట్టింది..ఎంఎస్ఐ. దాదాపు 9 వేల విలువ చేసే కుట్టు మిష‌న్ల‌ను..స‌బ్సిడీ ఇచ్చి…1500 ఈఎంఐ క‌ట్టుకునే విధంగా దాదాపు 250 మంది మ‌హిళ‌ల‌కు కుట్టు మిష‌న్ల‌ను ఇచ్చేందుకు న‌డంబిగించింది.

ఈ మేర‌కు జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ చేతుల మీదుగా..ఎంఎస్ఐ సంస్థ ఆధ్వ‌ర్యంలో స‌మాజ చైత‌న్య స్వ‌చ్చంద సేవా సంఘం…మ‌హిళ‌ల‌కు బ్యారెక్స్ లో కుట్టు మిష‌న్ల‌ను పంపిణీ చేయించారు..సేవా సంఘం అధ్య‌క్షుడు చిట్టిబాబు. 

ఈ సంద‌ర్బంగా ఎంపిక చేసిన ల‌బ్దిదారుల‌కు ఎస్పీ కుట్టుమిష‌న్ల‌ను పంపిణీ చేసారు. అంత‌క‌ముందు ఏఆర్ డీఎస్పీ శేషాద్రి ఆద్వ‌ర్యంలో డీపీఓలోని బ్యారెక్స్ ఆవ‌ర‌ణ‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఎస్పీ రాజ‌కుమారీ మాట్లాడారు.

మ‌హిళ‌లు ఆర్దికంగా ఎదిగేందుకు…ఈ  త‌ర‌హా స్వ‌చంద సంఘాలు ఆదుకోవ‌డం మంచిద‌న్నారు.స్త్రీ సాధించ‌న‌ది ఏదీ లేద‌ని…కుటుంబాన్ని నిలబెట్ట‌గ‌ల‌ద‌ని..మ‌హిళ త‌ల‌చుకుంటే చేయ‌ని  ప‌ని అంటూ ఏదీ లేద‌న్నారు.

ఎవ్వ‌రూ ఊహించ‌ని క‌రోనా లాంటి విప‌త్తు స‌మ‌యంలో ఇంట్లోనే ఉండిపోయిన కుటంబాన్ని తీర్చిదిద్దింది..ఒక్క మ‌హిళే అని ఎస్పీ తెలిపారు. అలాంటి మ‌హిళ బ‌తుకులో ఓ వెలుగు, ఓ ఆస‌రా..ఓ భ‌రోసాను నింపాల‌న్న ఆలోచ‌న చిన్న విష‌య‌మేమీ కాద‌న్నారు.

Related posts

తల్లిదండ్రులు పిల్లల కోసం సమయం కేటాయించాలి

Satyam NEWS

షేమ్: పసుపు చుట్టూ అరాచక రాజకీయం

Satyam NEWS

నెహ్రూ విధానాలే సర్వదా ఆచరణీయం

Bhavani

Leave a Comment