32.7 C
Hyderabad
March 29, 2024 12: 43 PM
Slider నిజామాబాద్

మహిళలు ఆర్థికంగా ఇంకా ఎదగాలి

sbi

కామారెడ్డి జిల్లా  జుక్కల్ మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డిచ్ పల్లి డైరక్టర్ సుదీ౦ద్రబాబు  అన్నారు, రూర్బన్ పథకం లో భాగంగా జుక్కల్, ఏడిగి, పెద్ద గుల్ల గ్రామాల్లో పదుల సంఖ్యలో మహిళలల కోసం కుట్టు మిషన్లు ఐకెపి కార్యాలయానికి పంపిణీ చేశారు.

ఈ మిషన్లు ద్వారా ఒక నెల పాటు ఈ మూడు గ్రామంలో 30 మంది మహిళలు బ్యాచ్ చొప్పున 18 నుండి 40 సం,, మహిళల కు ఎస్ బి ఐ గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. అందులో భాగంగా ఐకెపి కార్యాలయంలో యువతులు, మహిళలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా  డైరక్టర్  మాట్లాడుతూ ట్రైనర్ ద్వారా కుట్టు పని లో శిక్షణ, ఉచిత మధ్యన భోజనం, టీ అందిస్తామని చెప్పారు. త్వరలో శిక్షణ ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా కుట్టు మిషన్ల ను ఆయన పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎస్బీఐ  బ్యాంక్ మేనేజర్ చక్రవర్తి, ఏపీఎం  సత్యనారాయణ, మహిళ సంఘం అధ్యక్షురాలు భారతి బాయి, cc లు మహేష్,తుకరం, అంజయ్య, బాలాజీ,తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎర్ర కోట నుంచి మోడీ చేసిన వ్యాఖ్యలతో చైనాకు ఎక్కడో కాలింది

Satyam NEWS

ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ అర్హత అభ్యర్ధులకు రాత పరీక్ష

Satyam NEWS

బీజేపీకి కొత్త జాతీయ కార్యనిర్వాహక కమిటీ

Sub Editor

Leave a Comment