యాదగిరి గుట్టలో అసలు ఏం జరుగుతోంది? కేసీఆర్ బొమ్మలు కారుగుర్తులు కాదు. ఇప్పుడు అంతకన్నా పెద్ద ఉపద్రవం వచ్చిపడింది. యాదగిరి గుట్టలో దారుణం జరిగిపోతున్నది. దేవాలయం పేరుతో దరిద్రాన్ని తెచ్చిపెడుతున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొని ఉంది. యాదగిరిగుట్టలో పునర్ నిర్మాణం చేపడుతున్న ఆలయంలో బూతు బొమ్మలు కూడా ఉన్నాయి. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ దేవాలయంలో బూతుబొమ్మలు చెక్కారు. అత్యంత దారుణమైన ఈ విషయం ఇప్పటి వరకూ ఎవరి దృష్టికి రాలేదు. సత్యం న్యూస్ దీనికి సంబంధించిన ఆధారాలను ఇక్కడ పొందుపరుస్తున్నది. మేధావులు, ఆలోచనాపరులు ఈ విషయంపై దృష్టి సారించాలి. లేకపోతే యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం కాజాలదు. దేవాలయాలపై ఒకప్పుడు బూతు బొమ్మలు ఉండేవి. అది ఆ నాటి కాలమాన పరిస్థితుల్లో అనివార్యం. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు దేవాలయాలపై బూతు బొమ్మలు పెట్టుకుంటూ పోతే మనం నాగరికత వైవు వెళుతున్నామా లేక పూర్వకాలంలోకి వెళ్లిపోతున్నామా అనేది ఆలోచించుకోవాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి పిల్లల నుంచి పెద్ద వారి వరకూ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న ఈ రోజుల్లో దేవాలయాల్లో బూతు బొమ్మలు ఉంటే ఎలా? ఒక వ్యక్తి ఒక వ్యక్తితోనే సంపర్కంతో ఉండాలని అందరూ చెబుతుంటే ఒకే వ్యక్తి ముగ్గురు మహిళలతో సంభోగిస్తున్నట్లు శిల్పాలుచెక్కి దేవాలయాల్లో పెడితే ఇంకేమన్నా ఉందా? దేవాలయాల పునరుద్ధరణ పేరుతో మనం ఈ సమాజానికి ఇస్తున్న మెసేజ్ ఏమిటి? యాదగిరి గుట్టలో ఒక స్థంభంపై ఒక పురుషుడు ముగ్గురు మహిళలతో ఒకే సారి సంభోగిస్తున్నట్లుగా శిల్పం చెక్కారు. దారుణమైన ఈ విషయాన్ని ఇంతకన్నా విశ్లేషించిచెప్పడం కుదరదు. పెరుగుతున్న లైంగిక వ్యాధుల నేపథ్యంలో సేఫ్ సెక్స్, ఒకరితోనే సెక్సు అనే కాన్సెప్టులను చాలా కాలంగా ప్రభుత్వం ప్రచారం చేస్తున్న ఈ కాలంలో ఒకే సమయంలో ముగ్గురితో సెక్స్ చేసే భంగిమలు ప్రచారం చేయడం అదీ కూడా దేవాలయాల్లోనా? దారుణం. అత్యంత దారుణం. ఇది కూడా ఎవరూ చెప్ప కుండా శిల్పులే చేశారని చెబుతారా కిషన్ రావుగారూ? లేక ఇది మీ టేస్టుకు అనుగుణంగా చేయించుకున్నారా? (కిషన్ రావు యాదాద్రి నిర్మాణ ప్రత్యేక అధికారి)
previous post