కామం తో రగిలిపోయిన ఇద్దరు తమ లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి మూగజీవాలను ఎంచుకున్న దారుణ ఘటన ఇది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో ఇద్దరు దుండగులు మూగజీవాలపై లైంగిక దాడికి పాల్పడ్డారు.బోయినపల్లి ఎస్సై జి.శ్రీనివాస్ కథనం ప్రకారం నర్సింగాపూర్ గ్రామంలో ఓ రైతుకు చెందిన గేదెను అదే గ్రామంలో గ్రానైట్ క్వారీలో కూలీలుగా పనిచేస్తున్న లలిత్ కుమార్, హరీష్ అనే ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేస్తుండగా ఓ వ్యక్తి వారిని చూసి ఎస్సై జి.శ్రీనివాస్ కి సమాచారం అందించారు.
దీంతో అక్కడకు చేరుకుని వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితులు రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయపూర్ కు చెందిన వారిగా ఎస్సై తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.కాగా ఈ వ్యక్తుల కామాచేష్టలకు పలువురు చివాట్లు పెట్టారు.