25.7 C
Hyderabad
June 22, 2024 05: 29 AM
Slider విశాఖపట్నం

విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రిలో మళ్ళీ లైంగిక వేధింపులు

#Pedda Cheruvu

విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రిలో మళ్ళీ లైంగిక వేధింపులు కలకలం రేపాయి. నిన్న కేజీహెచ్ ఉద్యోగి కంప్యూటర్ అసిస్టెంట్ దిలీప్ మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేయగా, నేడు కేజీహెచ్ సూపరిండెంట్ అశోక్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.

ఆరోపణలుకు అడ్డగా మారిన ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్ ఆస్పత్రి అనే విమర్శలు వినిపిస్తున్నాయి. డాక్టర్ అశోక్ కుమార్ తన మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నర్సింగ్ సూపరింటెంట్ విజయలక్ష్మి సంచలన ఆరోపణ చేశారు. ఆమెను ఇటీవలే విధుల నుంచి సరెండర్ చేశారు.

విజయలక్ష్మి సీపీ రవిశంకర్ కు వాట్సప్ కంప్లీట్ ద్వారా ఫిర్యాదు చేశారు. అనంతరం వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో నర్సింగ్ సూప రిండెంట్ విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ పోలీసులు సూపరిండెంట్ అశోక్ కుమార్ నుండి స్టేట్మెంట్ రికార్డు చేశారు.

సూపరిండెంట్ అశోక్ కుమార్ పై మంగళవారం అర్ధరాత్రి ఎఫ్ఐఆర్ ను వన్ టౌన్ పోలీసులు నమోదు చేశారు. కీలక సెక్షన్ల తో ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు తెలిసింది. క్షుణ్ణంగా దర్యాప్తు చేసేందుకు ఇద్దరు ఏసీపీ స్థాయి అధికారులను నియమించారు.

Related posts

హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలి

Satyam NEWS

జగన్ క్యాబినెట్: ఒకరిద్దరు తప్ప అందరూ అవుట్

Satyam NEWS

ప్రాణాలు పోయేదాక స్పందించరా?: షబ్బీర్ అలీ

Satyam NEWS

Leave a Comment