తిరుపతిలో ఒక బాలుడిపై అఘాయిత్యం చేశాడో ఉపాధ్యాయుడు. 8వ తరగతి విద్యార్థి పై వ్యాయామ ఉపాధ్యాయుడు ఒకరు అభ్యంతరకరమైన రీతిలో ప్రవర్తించడంతో ఆ పిల్లవాడు తల్లడిల్లిపోయాడు. ఆ బాలుడిపై వ్యాయామ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
విద్యార్థి మర్మాంగాలపై తీవ్ర గాయాలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న విద్యార్ధి తల్లిదండ్రులు అందరికి చెప్పడంతో తల్లిదండ్రులు పెద్దఎత్తున గుమికూడి పాఠశాల ముందు ఆందోళన చేశారు. అమరేష్ అనే ఈ వ్యాయామ ఉపాధ్యాయుడు పరారీలో ఉన్నాడు. అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు తీవ్రతరం చేశారు. లైంగిక వేధింపులకు గురి అయిన బాలుడిని చికిత్సకోసం ఆసుపత్రికి పంపారు.