37.2 C
Hyderabad
March 28, 2024 19: 00 PM
Slider మహబూబ్ నగర్

ఆత్మహత్యలు నిరుద్యోగులకు రాజభోగం కేసిఆర్ కుటుంబానికా?

#wanaparthy

తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగంపై నిరసన వ్యక్తం చేస్తూ వనపర్తి జిల్లా కేంద్రంలో SFI-DYFI ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో DYFI జాతీయ సహాయ కార్యదర్శి విజయ్, రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ కుటుంబం రాజభోగం అనుభవిస్తున్నదని విమర్శించారు. ఉద్యోగం కోసం నిరుద్యోగులు చస్తుంటే లెక్క పెట్టుకోవాల్సిన దుస్థితి బంగారు తెలంగాలో ఏర్పడ్డదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే ఉద్యోగాల నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి స్కాలర్షిప్, రియంబర్స్ మెంట్ ను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే కొలువుల కోసం కొట్లాటకు ఎంతకైనా తెగిస్తామని వారు హెచ్చరించారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ సిబ్బంది ఏ.ఓ వెంకటకృష్ణ కి వారు అందచేశారు.

ఈ కార్యక్రమంలో SFI జిల్లా అధ్యక్ష,కార్యదర్శి కళ్యాణ్,ఎం.ఆది,DYFI జిల్లా అధ్యక్ష,కార్యదర్శి రాఘవేంద్ర,నీలం ఆంజనేయులు DYFI జిల్లా ఉపాధ్యక్షుడు బి.కుమార్,తాఫిక్ DYFI జిల్లా సహాయ కార్యదర్శి ప్రవీణ్,SFI నాయకులు కుమార్,హరీష్DYFI నేతలు కర్ణాకర్,మాసుం తదితరులు పాల్గొన్నారు.

Related posts

నీట్, జేఈఈ విద్యార్థుల కోసం వాట్సాప్ గ్రూప్ మెంబర్ షిప్

Satyam NEWS

మోటారు మెకానిక్ లకు వివిసి మోటార్స్ బియ్యం పంపిణీ

Satyam NEWS

రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వైద్య సేవలు అందించాలి

Satyam NEWS

Leave a Comment