35.2 C
Hyderabad
April 20, 2024 16: 29 PM
Slider మహబూబ్ నగర్

రేపు జరగబోయే కలెక్టర్ ముట్టడిని విజయవంతం చేయండి

#sfikollapur

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని సెప్టెంబర్ 8 న జరిగే కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయాలని SFI కోరింది. SFI జిల్లా సహాయ కార్యదర్శి డి. శేఖర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1న ప్రారంభమైన విద్యాసంస్థలు విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలికింది అని అన్నారు.

విద్యా సంస్థలు ప్రారంభానికి చూపెట్ట శ్రద్ధ ప్రభుత్వ విద్యా బలోపేతానికి ఎందుకు చూపెట్టడం లేదు అని  ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్ విద్యారంగానికి బడ్జెట్ కేటాయించడం లో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా చాలా పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయి. నాగర్ కర్నూలు  జిల్లా వ్యాప్తంగా అన్ని  మండలాలకు రెగ్యులర్ MEO లు లేరు కాబట్టి చాలా బాధాకరం ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అన్ని మండలాల్లో రెగ్యులర్ MEO లను  నియమించాలని డిమాండ్ చేశారు.

రేషనలైజేషన్ పేరుతో నాగర్ కర్నూలు జిల్లా పాఠశాలలో మూసివేసే పరిస్థితి కనపడుతుంది దీనివలన  ఉపాధ్యాయులు పోస్టులు గల్లంతయితే పరిస్థితి ఉంది  అని హెచ్చరించారు . అదేవిధంగా కళాశాలకు పక్కా భవనాలు నిర్మించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల సెప్టెంబర్ 7న కలెక్టరేట్ ముట్టడిలో విద్యార్థులు విద్యార్థినిలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Related posts

కరోనా క్లీనిక్: మాధ్యమాలకు బాధ్యత ఎక్కువ

Satyam NEWS

కొల్లాపూర్ సర్కిల్ పరిధిలో అక్రమ సారాపై దాడులు

Satyam NEWS

వచ్చే ఏడాది యూపీ ఎన్నికలకు అధికార బీజేపీ సమాయత్తం

Sub Editor

Leave a Comment