27.7 C
Hyderabad
April 26, 2024 03: 45 AM
Slider ముఖ్యంశాలు

దళిత యువతి అత్యాచారంపై ఎస్ఎఫ్ఐ నిరసన

#SFINekrekal

ఉత్తరప్రదేశ్ లో దళిత యువతిని అత్యాచారం చేసి చంపడాన్ని నిరసిస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గంలోని చిట్యాల పట్టణంలో గురువారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. 

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్  ముఖ్యమంత్రిగా అయినప్పటి నుండి  మహిళలపై దాడులు దౌర్జన్యాలు, అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయని వాటిని అరికట్టడంలో ప్రభుత్వం  పూర్తిగా విఫలమైందన్నారు.

దళిత యువతిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హింసించి చంపిన దుండగులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి అన్నారు.  పోలీసులు అర్ధరాత్రి కుటుంబ సభ్యులను ఒక గదిలో పెట్టి  బంధించి యువతికి అంత్యక్రియలు జరపడం దారుణం అన్నారు.

ప్రభుత్వం పోలీసుల ద్వారా బాధితులకు రక్షణ కల్పించాల్సింది పోయి బాధితుల ని మరింత భయపెడుతున్నారు. మహిళలకు రక్షణ కల్పించలేని యోగి  ముఖ్య మంత్రి పదవి నుండి వై దొలగాలి అని ఆయన డిమాండ్ చేశారు.

 దేశంలో రోజుకు అనేకమంది అమ్మాయిలపై దాడులు దౌర్జన్యాలు పెరుగుతున్న కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ ఐ జిల్లా సహాయ కార్యదర్శి జిట్టరమేష్ ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు గోలి సాయి కిరణ్ ప్రజా సంఘాల బాద్యులు జిట్ట స్వామి ఎస్ఎఫ్ఐ మండల నాయకులు మేడి అనిల్ జిట్ట దినేష్ గొడిశాల సంతోష్ దేవరకొండ రాకేష్ మెట్టు మధు తదితరులు పాల్గొన్నారు

Related posts

కిసాన్ సర్కార్ కాదు.. కసాయి సర్కార్

Satyam NEWS

త‌మిళ ద‌ర్శ‌క నిర్మాత విసు క‌న్నుమూత‌

Satyam NEWS

ఆన్ లైన్ క్లాస్ లపై సెక్టోరియల్ అధికారి తనిఖీలు

Satyam NEWS

Leave a Comment