31.7 C
Hyderabad
April 25, 2024 00: 02 AM
Slider ముఖ్యంశాలు

అయ్య నోటిఫికేషన్లు ఇస్తే కొడుకు లీక్ చేస్తాడు

#shabbirali

కేసీఆర్, కేటీఆర్ లపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఫైర్

అయ్య(సీఎం కేసీఆర్) నోటిఫికేషన్లు ఇస్తే కొడుకు(మంత్రి కేటీఆర్) లీక్ చేస్తాడని మాజీ మంత్రి షబ్బీర్ అలీ సెటైర్లు వేశారు. టీఎస్పీఎస్సి ప్రశ్నాపత్రాల లీకేజీపై కాంగ్రెస్ పార్టీ విద్యార్తి విభాగం ఎన్ఎస్యూఐ, యూత్ సంఘాలు భగ్గుమన్నాయి. కామారెడ్డి జిల్లా  వ్యాప్తంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. పేపర్ లీకేజీ కి కారకులైన కేటీఆర్ మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని, అసమర్థ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనిత రామచంద్రన్ లు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడించారు.

ఎన్.ఎస్.యూ.ఐ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎన్.ఎస్.యూ.ఐ నాయకులు కలెక్టరేట్ గేటు ఎక్కి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చేసుకోగా పోలీసులు అరెస్ట్ చేసి దేవునిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ దేవునిపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎన్.ఎస్.యూ.ఐ నాయకులను విడిపించారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కేటీఆర్ ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని,  పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ 5లక్షలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలను సీఎం కేసీఆర్  రోడ్డులపాలు చేశారన్నారు. ప్రభుత్వ తీరుతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారి ఆత్మ ఘోష ఊరికే పోదని, మీ కుటుంబం మొత్తం ఊచలు లెక్క పెట్టే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. ఎన్నో పోరాటాల ఫలితంగా అరకోర

నోటిఫికేషన్లు వచ్చినప్పటికీ ఆ నోటిఫికేషన్లను సక్రమంగా నిర్వహించడంలో టీఎస్పీఎస్సీ విఫలమైందన్నారు. ప్రతి నోటిఫికేషన్ హైకోర్టు మెట్టెక్కిందన్నారు. లీకేజీలు తోటి నిరుద్యోగుల ఆశలను అడియాశలు చేసిందని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగుల మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న వెంటనే పీఆర్సీ నివేదిక ప్రకారం 2 లక్షల 91 వేల వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ లీకేజీ అయిన పేపర్‌లని వెంటనే రద్దు చేయాలని, టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శి నైతిక బాధ్యతలు వహించి తమ పదవులకు రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెడుతుందని  హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్, యువజన కాంగ్రెస్ నాయకులు చందు, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

లోపలికి వెళ్లేందుకు గేటు ఎక్కిన ఎన్.ఎస్.యూ.ఐ నాయకుడు సందీప్

Related posts

పవన్‌ కల్యాణ్ కాపుల తరఫున మాట్లాడడంలేదు

Satyam NEWS

నా ప్రాణాలు అడ్డుపెట్టి అయినా నా వారిని కాపాడుకొంటా…

Satyam NEWS

మఠంపల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ నేతల నిరసన

Satyam NEWS

Leave a Comment