24.7 C
Hyderabad
March 26, 2025 10: 30 AM
Slider నిజామాబాద్

షాదిముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

shadimubarak

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే షాదిముబారక్ చెక్లను లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శనివారం  అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి కెసిఆర్ పెద్దన్న లాగా తోడయ్యారన్నారు. ఈ కరోనా మహమ్మారిని ఎదిరించడం లోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుందని ఈ సందర్భంగా గుర్తుచేశారు ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించి ఇంటి నుండి బయటకు రాకుండా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ జడ్పి చైర్మన్ దఫేదర్ రాజు ఎంపిపి పట్లోళ్ల  జ్యోతి దుర్గారెడ్డి తెరాస అధ్యక్షులు సత్యనారాయణ  మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు విఠల్ సిడిసి చైర్మన్ గంగారెడ్డి వైస్ పిపి మనోహర్ సహకార సంఘం అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు తెరాస నాయకులు పాల్గొన్నారు .

Related posts

దేశం నగుబాటుకు జగన్మోహన్ రెడ్డి ఉన్మాద చర్యలు కారణం కావచ్చు

Satyam NEWS

ఇగురం రచయిత గంగాడి సుధీర్ రెడ్డిని అభినందించిన సీఎం కేసీఆర్

Satyam NEWS

వలస కూలీలకు నిత్యావసరాల కిట్ల పంపిణి

Satyam NEWS

Leave a Comment