36.2 C
Hyderabad
April 23, 2024 22: 47 PM
Slider కడప

ఒక్క రాజదానికే దిక్కు లేదు..మూడు రాజధానులా…

#bjpkadapa

అన్నమయ్య జిల్లా రాజంపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గురువారం బిజెపి రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జ్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతు గుంట రమేష్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలతో స్థానిక నాయకులు పవిత్రమైన ఆలయాల్లో మూడు రాజధానులకు మద్దతుగా  టెంకాయలు కొట్టడం సిగ్గు పాలన చర్య అన్నారు.

అమ్మకు అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్న చందంగా, ఒక రాజధానికే దిక్కు లేక దాన్ని అభివృద్ధి పరచక ప్రజల్లో ప్రాంతీయ భేదాలు సృష్టించడానికి ఈ కార్యక్రమం చేయడం చాలా అవమానకరం బాధాకరం అన్నారు. రాష్ట్రం ఇప్పటికీ ఆర్థికంగా దివాలా తీసిందని, అప్పులు పుట్టే పరిస్థితి లేదు అటువంటి పరిస్థితుల్లో మూడు రాజధాని ఎలా సాధ్యమవుతాయో జగన్మోహన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.

అలాగే స్థానిక ప్రజాప్రతినిధులైన వీరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సిగ్గుమాలిన చర్య అని, ఎందుకంటే వీరి వల్లే ఇప్పటికే ఈ ప్రాంతం జిల్లా కేంద్రం కావాల్సింది వీరి అసమర్ధత వల్ల ఈ ప్రాంతంలో జిల్లా కేంద్రం కాకుండా రాయచోటి జిల్లా కేంద్రం అయిందని, దీని పాపం ఈ స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ బాధ్యత వహించాలని ఇటువంటి సందర్భంలో దేవాలయాల దగ్గర టెంకాయలు కొట్టడం అంటే ప్రజలే కాదు భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడని అన్నారు.

ఇప్పటికైనా మేల్కొని రాష్ట్ర ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పి మూడు రాజధానులు బిల్లును వెనక్కి తీసుకొని ఒకటే రాజధానిగా దాని అభివృద్ధి కొరకు పాటుపడాలని ఈ సందర్భంగా బిజెపి డిమాండ్ చేసారు. ఇప్పటికే మీ అసమర్ధత మీ స్వార్థం కారణంగా ఈ ప్రాంతంలో ఉన్న అన్నమయ్య డ్యాం పెంచడం కొట్టుకొని పోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇంకా మీరు ఏ మొహం పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు చేపడతారో అర్థం కావడం లేదని రాబోయే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెబుతారని వారన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్టుపోగల ఆదినారాయణ పట్టణ ప్రధాన కార్యదర్శి జీకే నాగరాజు బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కంబాల శ్రీనివాసులు పట్టణ ఉపాధ్యక్షులు తోట నగేష్ పట్టణ కార్యదర్శి పి రమణ సీనియర్ నాయకులు గాదెల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

Related posts

ఆర్ కె బీచ్ లో గల్లంతు: ప్రియుడితో ప్రత్యక్షం

Satyam NEWS

కరోనా సమయంలో కాకినాడ రూరల్ జర్నలిస్టుల సంక్షేమ కమిటీ

Satyam NEWS

కరోనా చికిత్సకు మందుల కొరత రానివ్వొద్దు

Satyam NEWS

Leave a Comment