37.2 C
Hyderabad
March 29, 2024 17: 18 PM
Slider ఆదిలాబాద్

ప్రేమ పేరుతో పొదలచాటుకు వెళ్లేవారిపై షీ టీమ్స్ నిఘా

#LoveBirds

ప్రేమ పేరుతో విచ్చలవిడిగా తిరుగుతున్న జంటలకు షీ టీమ్స్ చుక్కలు చూపిస్తున్నాయి. పార్కుల్లో, ఏకాంత ప్రదేశాలలో తిరుగుతున్న జంటలు పట్టుకోవడంలో కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా షీ టీమ్స్ అన్ని చర్యలు తీసుకుంటున్నాయి.

ఇలా ప్రేమ జంటలను పట్టుకుని వారికి కౌన్సిలింగ్ ఇప్పించడంలో షీ టీమ్స్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాయి. వారికే కాకుండా ప్రేమ జంటల తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇప్పిస్తుండటం ఆసిఫాబాద్ జిల్లా షీ టీమ్స్ ప్రత్యేకతగా కనిపిస్తున్నది.

ప్రేమ పేరుతో విచ్చలవిడిగా తిరుగుతున్న మైనర్ బాలికలకు షీ టీమ్స్ మరింత శ్రద్ధతో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. షీ టీమ్స్ మొన్న చేసిన గాలింపు చర్యల్లో పెంచికల్ పేట మండలానికి చెందిన ఒక ప్రముఖ వ్యాపారి కుమార్తె కూడా పట్టుబడినట్లు తెలిసింది.

ఆ అమ్మాయి తన ప్రియుడితో కలిసి ఏకాంత స్థలంలో దొరకడంతో షీటీమ్స్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాయి. వెంటనే ఆ ఇద్దరిని కౌన్సిలింగ్ కు తరలించారు. నిన్న ఈ ఇద్దరిని వదిలేసి వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ప్రేమ పేరుతో యువతీ యువకులు కలిసి తిరుగుతూ అందరికి తలనొప్పులు తెస్తున్నారని పోలీసులు అంటున్నారు.

ఇలా ప్రముఖుల పిల్లలు దొరికినప్పుడు తమకు మరింత ఇబ్బంది ఎదురవుతున్నదని కూడా వారు అంటున్నారు. పిల్లలు చెడుతిరుగుళ్లు తిరగకుండా కట్టడి చేయడం మరచిపోయిన తల్లిదండ్రులు వారి పిల్లలు ఇలాంటి అభ్యంతరకరపరిస్థితుల్లో దొరికినప్పుడు మాత్రం తమపై వత్తిడి తెస్తున్నారని పోలీసులు అంటున్నారు.

పిల్లల పేర్లు బయటకు చెప్పవద్దని అడుగుతున్నారని, అంతే తప్ప పిలలకు ఇచ్చే కౌన్సిలింగ్ ను అర్ధం చేసుకోవడం లేదని పోలీసులు అంటున్నారు. తమ పరువు ఎక్కడపోతుందో అని భయపడుతున్నారు తప్ప పిల్లల్ని అదుపులో పెట్టుకోవడం లేదని వారు అంటున్నారు.

Related posts

దేవాదాయ మంత్రిని, దుర్గగుడి ఈవోను తొలగించాలి

Satyam NEWS

యూకె స్ట్రెయిన్ భయంకరమైనది కాదు

Sub Editor

ఈ జీవోతో లోకేష్, పవన్ కల్యాణ్ లను అడ్డుకోవడం సాధ్యమేనా?

Bhavani

Leave a Comment