28.2 C
Hyderabad
December 1, 2023 19: 23 PM
Slider సినిమా

ప్రముఖుల సమక్షంలో “ప్రత్యక్ష దైవం షిర్డిసాయి” గీతావిష్కరణ

దత్త ఫిలిమ్స్ నిర్మాణంలో మచ్చా రామలింగారెడ్డి షిర్డిసాయిగా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “ప్రత్యక్ష దైవం షిర్డిసాయి”. భానుచందర్, సీత ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఆడియో వీడియో పాటల ప్రదర్శన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. శ్రీభంసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్రాంత ఇన్ కంటాక్స్ ప్రిన్సిపల్ ఛీప్ కమీషనర్ నరసింహప్ప అధ్యక్షతన జరిగిన ఈ పాటల ఆవిష్కరణ కార్యక్రమంలో దర్శకులు ఓం సాయి ప్రసాద్, రేలంగిన రసింహారావు, ఇన్ కంటాక్స్ కమీషనర్ జీవన్ లాల్, పాటల రచయిత బిక్కికృష్ణ, ఎసిపి రామ్ దాస్ తేజ, లయన్ డా.విజయ్ కుమార్, వి.డి.రాజగోపాల్, శ్రీమతి గిడుగు కాంతికృష్ణ, సీనియర్ జర్నలిస్టులు ప్రభు, ధీరజ అప్పాజీ తదితరులు పాల్గొన్నారు.

శతచిత్ర దర్శకులు ఓం సాయి ప్రకాష్ మాట్లాడుతూ సాయితత్వాన్ని ప్రచారం చేయడానికే తనను కర్ణాటక పంపించారన్నారు. మచ్చా రామలింగారెడ్డి సాయిపాత్రను ధరించి సాయిభక్తుల అనుభవాలతో చిత్రం తీయడం అభినందనీయమన్నారు. చీఫ్ కమీషనర్ నరసింహప్ప మాట్లాడుతూ సాయితత్వాన్ని జనంలోకి తీసుకొనిపోవడానికి సినిమా మీడియా బాగా ఉపయోగపడుతుందన్నారు.

యువతరంలో ఆధ్యాత్మికతను పెంపొందించడానికి ప్రత్యక్షదైవం షిర్డిసాయి చిత్రాన్ని మచ్చా రామలింగారెడ్డి నిర్మించడం గొప్ప విషయమన్నారు. భక్తిరస చిత్రాన్ని యం.ఆర్.రెడ్డి నిర్మించడం అభినందనీయమని కమీషనర్ జీవన్ లాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు కొండవీటి సత్యం, నిర్మాతలు వెంకట్,vసుబ్బారావు, సంగీతదర్శకులు కిషన్ కవాడియా తదితరులు పాల్గొన్నారు.

Related posts

OTC New Penis Pills

Bhavani

టీడీపీ హయాంలో విజయనగరం ఆర్డీఓ అడ్డగోలుగా అమ్మేయలేదా

Satyam NEWS

మారియుపోల్ ను స్వాధీనం చేసుకున్న రష్యా సేనలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!