34.2 C
Hyderabad
April 23, 2024 13: 36 PM
Slider జాతీయం

పొలిటికల్ హీట్ : రేపటి నుండి షిర్డీ ఆలయం మూసివేత

shirdi temple

జనవరి 19ఆదివారం నుంచి షిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసి వేయనున్నట్లు సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ప్రకటించింది.మహారాష్ట్ర అభివృద్ధి పేరిట ముఖ్యమంత్రి ఉద్బవ్ ఠాక్రే తీసుకున్న నిర్ణయాలు ఆలయాన్ని మూసివేయడానికి కారణం. తాజాగా ఇక్కడ సాయి జన్మభూమి వివాదం మొదలైంది. సాయిబాబా జన్మస్థలం పర్భణీ జిల్లాకు చెందిన పత్రీ అని స్థానికులు భావిస్తూ 1999లో శ్రీ సాయి జన్మస్థాన్‌ మందిరాన్ని నిర్మించారు.

వేల సంఖ్యలో భక్తులు అక్కడికి వస్తుండడంతో ఆ పట్టణం అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయనున్నట్టు ఇటీవల ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించారు. దీనిపైన బీజేపీ విభేదిస్తోంది. జన్మభూమి కంటే కర్మభూమి గొప్పదని వాదిస్తోంది. ఇదే సమయంలో సీఎం ప్రకటనకు నిరసనగా జనవరి 19వ తేదీ ఆదివారం నుంచి షిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసి వేయనున్నట్లు సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ప్రకటించింది. ఈ మేరకు ట్రస్ట్‌ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తదుపరి కార్యాచరణపై చర్చించడానికి శనివారం సాయంత్రం షిరిడీ గ్రామస్థులంతా సమావేశం కానున్నట్లు స్పష్టం చేసింది.
పత్రిని అభివృద్ధి చేస్తే షిర్డీ ప్రాముఖ్యం తగ్గిపోతుందని ఆందోళన వెలిబుచ్చింది.సాయిబాబా జన్మించిన స్థలం పత్రీ అని నిరూపించడానికి తగినన్ని ఆధారాలు ఉన్నాయని అహ్మద్‌నగర్‌ జిల్లాలోని శిరిడీ సాయిబాబా ‘కర్మ భూమి’ అయితే పత్రీ ఆయన ‘జన్మభూమి’ అని అందుకే పత్రికి నిధులు మంజూరు చేసారని పత్రీ కి ప్రాధాన్యం లభిస్తే తమ క్షేత్ర ప్రాధాన్యం తగ్గుతుందని శిరిడీ వాసులు భయపడుతున్నారని కొందరి అభిప్రాయం. పత్రీ కి చాలా మంది భక్తులు వస్తున్నా పట్టణంలో కనీస సౌకర్యాలు లేవని అందుకే ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేశారని దీనిపై రాజకీయం తగదని షిర్డీకి చాలా దూరంలో పత్రీ గ్రామాం ఉందని దీనిపై వివాదం తగదని వారు పేర్కొన్నారు.

Related posts

కృష్ణా జిల్లాలో 15 థియేటర్లు సీజ్ చేసిన అధికారులు

Satyam NEWS

వివేకా హత్యకేసులో ఇక ప్రముఖుల విచారణ షురూ

Satyam NEWS

వైసీపీలో మరో ధిక్కార స్వరం

Satyam NEWS

Leave a Comment