24.7 C
Hyderabad
March 26, 2025 09: 22 AM
Slider ప్రత్యేకం

సీఎం రేవంత్ రెడ్డి సర్వేలో షాకింగ్ ఫలితాలు!

#revanthreddy

తెలంగాణ రాష్ట్రంలో రెడ్ జోన్లో 26 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చేయించుకున్న సర్వేలో షాకింగ్ ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఉందనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా థర్డ్ పార్టీ సర్వేను రేవంత్ రెడ్డి నిర్వహించారు. కాంగ్రెస్ గెలిచిన 65 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర విభాగాలపై రేవంత్ రెడ్డి సర్వే చేయించారు. ఈ సర్వేలో ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ప్రభుత్వం పనితీరు, జిల్లా లేదా స్థానిక స్థాయిలో పరిపాలన, ప్రజల ఆశయాలపై దృష్టి సారించారు.

అయితే 26 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో, 14 మంది ఆరెంజ్ జోన్లో, మిగతా వారు సేఫ్ జోన్లో ఉన్నారని సర్వే వర్గాలు వెల్లడించాయి. సర్వే ప్రకారం కొంతమంది మంత్రులు వారి నియోజకవర్గాల్లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధిని నిర్లక్ష్యం చేసినందుకు విమర్శలను ఎదుర్కొంటున్నారు. రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలను సందర్శించకుండా, హైదరాబాదులో ఎక్కువ సమయం గడుపుతు.. వారు వారి వ్యాపార ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

మరి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వినిపించాయి.. వీరిలో 8 నుంచి 10 మంది ఇసుక అక్రమ రవాణా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పంక్తులు కలిగించే కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని సర్వేలో వెల్లడి అయింది. ఆరెంజ్ జోన్లోని ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమై, పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. దావోస్ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ ఎమ్మెల్యేలతో సమావేశాలను ఏర్పాటు చేయాలనే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు.

Related posts

దమ్ము లేని రాజకీయ పార్టీలు విశాఖ ఉక్కును కాపాడగలవా….?

Satyam NEWS

రేపటి నుండి కంటి వెలుగు

Satyam NEWS

కేసీఆర్ కార్యాలయం ఎదుట ఒకరి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment