30.7 C
Hyderabad
April 19, 2024 07: 01 AM
Slider మహబూబ్ నగర్

ఎస్ సి లకు రిజర్వు చేసిన దుకాణాలు వారికే కేటాయించాలి

#MalaMahanadu

ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన షాపులను వారికే  కేటాయించాలని మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు కు తెలంగాణ మాల మహానాడు నాయకులు వినతి పత్రం సమర్పించారు. బినామీలకు కేటాయించిన షాపులను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఎస్సీల కేటాయించిన షాపును ఎందుకు కేటాయించలేదో సమాధానం చెప్పాలని మున్సిపల్ అధికారులను తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య డిమాండ్ చేశారు.

మహబూబ్ నగర్ మున్సిపల్ పట్టణంలోని న్యూ టౌన్ లో గల మున్సిపల్ వ్యాపార సముదాయంలో ఎఫ్ 29 షాపును ఎస్సీ రిజర్వేషన్లో  కురుమూర్తి అనే వ్యక్తికి కేటాయించి 50 వేల రూపాయలు డిపాజిట్ చేయించుకొని అతనికి షాప్ ఇవ్వలేదని ఆయన అన్నారు.

ఇతరులకు షాపు ఇచ్చి డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా తిరిగి ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు అధికార దుర్వినియోగం చేయడాన్ని తెలంగాణ మాలమహానాడు తీవ్రంగా ఖండించింది.

గత మూడు సంవత్సరాల నుండి డిపాజిట్ చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలని మున్సిపల్ అధికారులను కోరిన వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని అన్నారు.

మహబూబ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ వ్యాపార సముదాయంలో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన షాపులను వారికి కేటాయించకపోవడం వలన ఎస్సీ ఎస్టీల యువత ఉపాధి అవకాశం కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎస్టీలకు కేటాయించిన షాపులను ఎస్సీ ఎస్టీల కేటాయించాలని చేశారు.

బినామీల షాపులను రద్దు చేయాలని కోరారు. రిజర్వేషన్ సక్రమంగా అమలు చేయాలని అధికారులపైన చర్యలు తీసుకోవాలని చేశారు. చైర్మన్ ని కలిసిన వారిలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాడo   బాల్ రాజు,  రాష్ట్ర కార్యదర్శి మిట్టమీద బాలరాజ్, మండల అధ్యక్షులు గుంత లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.

Related posts

అమరావతి పోరాట స్ఫూర్తి అందరిలో రావాలి

Satyam NEWS

శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అందరూ హాజరుకండి

Satyam NEWS

సీఎం కేసీఆర్ రైతు ద్రోహి

Bhavani

Leave a Comment