35.2 C
Hyderabad
April 24, 2024 13: 33 PM
Slider మహబూబ్ నగర్

పల్లెల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు జాతీయ లఘు చిత్రాల పోటీ

#nagarkurnool collector

స్వచ్ఛత.. గ్రామాల్లో ప్రగతిని ప్రతిబింబిస్తుంది. ఏ స్థాయిలో అభివృద్ధి దిశగా పయనిస్తున్నామనే అంశాన్ని స్పష్టం చేస్తుంది.  ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం  స్వచ్ఛత ఫిల్మోన్‌  కా అమృత్‌ మహోత్సవ్‌’ పేరిట లఘుచిత్రాల పోటీకి ఆహ్వానిస్తోందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నాగర్ కర్నూలు జిల్లాలో స్వచ్ఛభారత్‌ మిషన్‌, డీఆర్డీవో ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారన్నారు. లఘుచిత్రాలను పంపించేందుకు ఆగస్టు 15 వరకు గడువుగా ఉందని, జిల్లాలో 461 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో డంప్‌యార్డు నిర్మాణం, తడి, పొడి చెత్త సేకరణ, సేంద్రియ ఎరువు తయారీ పారిశుద్ధ్య పనులు ఉద్యమంలా సాగుతోందన్నారు.

ఈ క్రమంలోనే ఆయా అంశాలపై ప్రజలను మరింత చైతన్యం తెచ్చేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖ సన్నద్ధమైందన్నారు. నిర్దేశిత ఆదర్శ అంశాలను లఘుచిత్రాలుగా తీసి పంపిస్తే ఉత్తమమైన వాటిని జాతీయస్థాయిలో ఎంపిక చేసి నగదు పురస్కారాలను ప్రదానం చేయనున్నరని ఆయన తెలిపారు. గ్రామపంచాయతీలు సహా మహిళా సంఘాలు, యువత, ఇతర సంఘాలు, వ్యక్తులకు పాల్గొనే అవకాశం ఉందన్నారు.

జిల్లాలో ఇప్పటికే కొందరు ఆసక్తిగలవారు దరఖాస్తులు చేసుకునేందుకు సంసిద్ధత చూపుతున్నారన్నారు. వివిధ పంచాయతీలు, పాలకవర్గ సభ్యులు ఈ పోటీలో పాల్గొనేందుకు సన్నద్ధమవ్వాలి అన్నారు.  స్వచ్ఛభారత్‌ మిషన్‌ (గ్రామీణ) రెండో దశలో భాగంగా ప్రజలకు పారిశుద్ధ్యంపై విస్తృత అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో లఘుచిత్రాల పోటీ నిర్వహిస్తోంది. సంబంధిత వీడియో లింకును https ://innovateindia.mygov.in/sbng.innovation-challenge/ ఈ వెబ్సైట్ నందు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన వారికి సాంకేతిక సహాయం, ఇతర సమాచార నిమిత్తం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించిన అధికారుల చరవాణి నంబర్లు 8639052917, 9121221878లో సంప్రదించాలని తెలిపారు.

పోటీ అంశాలు ఇలా..

ద్రవ, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ, సేంద్రియ ఎరువుల తయారీ, ప్రజల ప్రవర్తనలో మార్ఫు ఆయా అంశాల్లో ఏదైనా ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో నీరు, పారిశుద్ధ్య విభాగాల్లో విధులు నిర్వర్తించే వారు, బంధువులు మినహా..

పది సంవత్సరాల వయసు పైబడిన వారు ఎవరైనా పాల్గొనవచ్ఛు లఘుచిత్రం వ్యవధి ఒక నిమిషం నుంచి 5 నిమిషాల మధ్య ఉండాలి. గుర్తింపు పొందిన భారతీయ భాషలు/మాండలికాల్లో చిత్రాన్ని తీయవచ్ఛు పంచాయతీల్లోనే ఆయా అంశాలపై చిత్రీకరణ చేయాల్సి ఉంటుందన్నారు.

ఆయా భాషల్లో వాయిస్‌ ఓవర్‌, సంభాషణలు, సంగీతం, పాటల రూపంలో డాక్యుమెంటరీని రూపొందించవచ్ఛున్నారు.

నగదు ప్రోత్సాహకం ఇలా..

ప్రథమ బహుమతికి రూ.1.60 లక్షలు, ద్వితీయ రూ.60 వేలు, తృతీయ-రూ.30 వేలు అందజేయనున్నారు.

ఈ ఏడాది చివరన కొత్త దిల్లీలో జరిగే జాతీయస్థాయి స్వచ్ఛభారత్‌ మిషన్‌ వేడుకల్లో నగదు పురస్కారం, ప్రశంసాపత్రం ప్రదానం చేస్తారని తెలిపారు.

ఆగస్టు 15 వరకు గడువు ఉన్నందున జిల్లాలోని పంచాయతీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

స్వచ్ఛతపై జన చేతన తెచ్చేలా గ్రామాల్లో నిర్దేశిత అంశాలను ప్రతిబింబించేలా లఘుచిత్రాలను తీయాలని నాగర్ కర్నూల్ జిల్లా జిల్లా కలెక్టర్ శర్మన్ జిల్లాలోని లఘుచిత్ర హౌత్సహికులను కోరారు.

ఔట రాజశేఖర్, కొల్లాపూర్ సత్యం న్యూస్

Related posts

104 పాఠశాలల్లో పనులు పూర్తి

Murali Krishna

వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలోఅంబెడ్కర్ జయంతి

Satyam NEWS

ఈ పసిపిల్లలకు ఉన్న జ్ఞానం మనకు ఎప్పుడు వస్తుందో……?

Satyam NEWS

Leave a Comment