37.2 C
Hyderabad
March 28, 2024 18: 25 PM
Slider అనంతపురం

అశోకుని అంతటి ధీశాలి శ్రీకృష్ణదేవరాయలు

#Shree Krishna Devaraya

విజయనగర సామ్రాజ్య విస్తరణ అభివృద్ధిలో శ్రీకృష్ణదేవరాయలు కీలక పాత్ర పోషించాడని మీ, యుద్ధ తంత్రంలో అశోకుని అంతటి దీశాలి అని చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి చెప్పారు. శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల విజయనగరంలో శ్రీకృష్ణదేవరాయల 552 వ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన అరుదైన చక్రవర్తుల్లో శ్రీకృష్ణదేవరాయలు ఒకరని కొనియాడారు.

దేశంలో అత్యధిక భూభాగాన్ని పరిపాలించడమే కాకుండా ప్రజలకు మేలైన అవసరమైన పాలను అందించిన రాజుగా చరిత్రలో నిలిచిపోయారు. తాను రాజుగా పట్టాభిషేకం కాకముందు ఉన్నటువంటి వివాహ పన్ను చేతివృత్తుల పన్ను వంటి వాటిని రద్దు చేస్తూ శాసనాలను రాయించిన ఘనత రాయలవారిద.

తాను చేసిన యుద్ధాల్లో పట్టుబడిన శత్రు రాజులను, శత్రు సైన్యాలను చంపకుండా అదేవిధంగా రాజ్యాన్ని ఆక్రమించకుండా వారిని సామంతులుగా చేసుకొని సరికొత్త రాజనీతిని ప్రదర్శించారని మైనాస్వామి పేర్కొన్నారు.

కృష్ణదేవరాయల పాలన చేసిన వ్యవసాయ అభివృద్ధి అనుసరించిన రాజనీతి అన్నీ కూడా ఎంతో స్ఫూర్తినిచ్చే అంశాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకుడు ప్రసాద్, నారాయణ, గోరంట్ల రంగనాథ్, శ్రీరాములు, మైలారం మహేష్, నాగభూషణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సేవ్ గరల్ ఛైల్డ్: రేపు బాలికా దినోత్సవం

Satyam NEWS

తెలంగాణ నలుమూలలకు ఐటి పరిశ్రమల విస్తరణ

Bhavani

సొంత ఖర్చుతో యాగం చేసుకోండి

Satyam NEWS

Leave a Comment