39.2 C
Hyderabad
April 25, 2024 16: 24 PM
Slider నెల్లూరు

ఖాకీ ఛీటింగ్: అమ్మాయిని ట్రాప్ చేసిన పోలీసు అధికారి

Chejerla SI

పోలీసు అధికారి అంటే ఎలా ఉండాలి? స్ర్టిక్టు విధి నిర్వహణలో ఉండాలి. మోసం చేసేవారిని పట్టుకోవాలి. సమాజంలో ఎవరైనా తప్పు చేస్తే పట్టుకుని చట్టానికి అప్పగించాలి. అయినా అందమేంటో కాని ఒక ఎస్ ఐ ఫేస్ బుక్ లో ఒక అమ్మాయితో పరిచయం పెంచుకుని ఆ అమ్మాయిని మోసం చేశాడు.

నెల్లూరు జిల్లా చేజర్ల ఎస్ఐ క్రాంతి కుమార్ ఈ బాగోతానికి పాల్పడ్డాడు. ఫేస్‌బుక్ లో ఓ యువతిని ఫాలో అయ్యాడు. తనను తాను పరిచయం చేసుకొని ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. ఆ అమ్మాయి ఎస్ ఐ కదా అని నమ్మినట్లుంది. పెళ్ళిచేసుకుంటానని చెప్పగానే నమ్మేసింది.

ఎస్ఐ క్రాంతి కుమార్ చెప్పినట్టు చేసింది. దాంతో ప్రస్తుతానికి ఆ యువతి గర్భవతి అయింది. ఎస్ ఐ తనను వాడుకుని మోసం చేశాడని తెలియడంతో ఆ యువతి లబోదిబో మంటూ మొత్తుకుంది.

గుంటూరు ఐజి వినీత్ బ్రిజ్ లాల్ ని ఆశ్రయించి విషయం చెప్పింది. విషయం మొత్తం తెలుసుకున్న ఆయన ఎస్ఐ క్రాంతి కుమార్ ను సస్పెండ్ చేశారు. అదీ కథ.

Related posts

19 న యూసీసీ మద్దతు ర్యాలీ: కాటిపల్లి వెంకట రమణారెడ్డి

Satyam NEWS

రాజకీయాలు చేస్తున్న రాష్ట్ర గవర్నర్

Satyam NEWS

కేవలం చట్టాలు చేస్తేనే బాధితులకు న్యాయం జరగదు

Satyam NEWS

Leave a Comment