39.2 C
Hyderabad
March 29, 2024 13: 30 PM
Slider మెదక్

సిద్ధిపేట సమీకృత మార్కెట్ ఆవరణలో రైతు సేవ ఎరువుల కేంద్రం

#minister harishrao

ఇక రైతు తిప్పలు తప్పినయని, లాభాపేక్ష లేకుండా తక్కువ ధరలకే రైతులకు ఎరువులు, పురుగు మందులు రైతన్నల సాగుకు అవసరమైనవన్నీ ఎరువుల విక్రయాలు అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు పేర్కొన్నారు.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సమీకృత మార్కెట్ ఆవరణలో ఆదివారం ఉదయం ఉమ్మడి మెదక్‌ జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) సహకారంతో ఏర్పాటైన సమీకృత రైతు సేవ ఎరువుల కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు, కార్పొరేట్‌ కంపెనీ షోరూంలను తలదన్నే రీతిలో అన్ని హంగులతో దీనిని తీర్చిదిద్దనున్నట్లుగా మంత్రి వివరించారు.

రైతుల్లో అవగాహనకు ప్రత్యేక చర్యలు సాగు దిగుబడి పెంచేందుకు ఉపయుక్తమైన పురుగుల మందులు, ఇతర ఉత్పత్తుల వాడకం…ఇలా పలు అంశాలపై ఈ కేంద్రంలో రైతులకు అవగాహన కల్పించనున్నారని,. ఇందుకోసం  కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డీసీఎంఎస్‌ నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు.

కాగా మార్కెట్ ధరకే రైతులకు ఎరువులు విక్రయిస్తామని, రైతులకు దగ్గరగా సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సేవ కేంద్రాన్ని ప్రారంభించినట్లు, రైతులంతా ఈ ఎరువుల కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీసీఏంఎస్ చైర్మన్ శివకుమార్ కోరారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాల సాయిరామ్, డీసీఎంఎస్ డైరెక్టర్ కనక రాజు, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నందిని శ్రీనివాస్, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

యురేనియం వ్యర్ధాలపై నిపుణుల కమిటీ

Satyam NEWS

త్వరలో నే గ్రూప్ 4 ఫలితాలు వెల్లడి..?

Bhavani

సింగరేణితో అభివృద్ధి

Bhavani

Leave a Comment