37.2 C
Hyderabad
March 29, 2024 19: 08 PM
Slider మెదక్

మాస్కులు లేకుండా తిరిగే వారికి కౌన్సిలింగ్

#Siddipetpolice

హెల్మెట్, మాస్కు ధరించకుండా వాహనాలు నడిపే వారికి సిద్దిపేట పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. సిద్దిపేట ఎంపీడీవో ఆఫీస్ బిజెఆర్ చౌరస్తాలో, ట్రాఫిక్ ఆర్ఐ శ్రీధర్ రెడ్డి, ట్రాఫిక్ ఆర్ఎస్ఐ ఆంజనేయులు, ట్రాఫిక్ సిబ్బంది కానిస్టేబుల్ శ్రీహరి, హోం గార్డ్ శాకీర్, కలిసి వాహనాలు తనిఖీలలో భాగంగా ఈ కౌన్సెలింగ్ నిర్వహించారు.

మాస్కులు లేనివారికి మాస్కులు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆదేశానుసారం కొవిడ్-19 నిబంధనల ప్రకారం ఇంటి నుండి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని పోలీసులు కోరారు. బహిరంగ ప్రదేశంలో షాపింగ్ మాల్ లో, కూరగాయల మార్కెట్ వద్ద గుంపులు గుంపులుగా ఉండవద్దని ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని వారు ప్రజలకు వివరించారు.

తప్పకుండా మాస్కులు ధరించి, శానిటైజర్ వెంబడి ఉంచుకోవాలని, మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని అవగాహన కల్పించారు.

మాస్కులు లేకుండా కొవిడ్-19 నిబంధనలు పాటించని వారిపై విపత్తు నిర్వహణా చట్టంలోని 51 నుంచి 60 సెక్షన్లు 188 ఐపీసి చట్టప్రకారం  చర్యలు  తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Related posts

భత్యాల బర్త్ డే జరిపిన తెలుగుదేశం కార్యకర్తలు

Satyam NEWS

ప్రియురాలి కొడుకుని చంపిన ప్రియుడు….

Bhavani

జగన్ ఢిల్లీ టూర్ రహస్య ఎజెండా ఇదేనా?

Satyam NEWS

Leave a Comment