సింగరేణి కార్మికులకు దీపాబళి బోనస్ ను నేడు అందచేస్తున్నట్లు సి&ఎం.డి. ఎన్.శ్రీధర్ తెలిపారు. అధికారులు మినహా మిగిలిన కార్మికులు, ఉద్యోగులకు ఒక్కొక్కరికి 64,700 రూపాయల బోనస్ అందబోతున్నది. ఈ బోనస్ ను నేరుగా బ్యాంకు ఖాతాల్లో ఈ రోజు జమ చేశారు. దీపావళి బొనస్ గా పిలిచే ఈ పి.ఎల్.ఆర్. స్కీం ( పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు స్కీం) కోసం 258 కోట్ల రూపాయలను యాజమాన్యం విడుదల చేసింది. ఇటీవలనే 494 కోట్ల రూపాయల లాభాల బోనస్ ను పంపిణీ చేశారు. దీంతో సగటున లక్ష రూపాయలకు పైగా లాభాల బోనస్ ను కార్మికులు అందుకున్నట్లు అయింది. బోనస్ పైసలలో కొంత మొత్తం ప్రభుత్వ పొదుపు సంస్థల్లో దాచుకోవాలని యాజమాన్యం కార్మికులకు సూచించింది. కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు సి&ఎం.డి. ఎన్.శ్రీధర్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
previous post