ప్రముఖ నేపథ్య గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు ఆమెను హోలిస్టిక్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం కల్పనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నది. నిజాంపేటలోని వర్టెక్స్ ప్రివిల్లేజ్‌లో ప్రసాద్ అనే వ్యక్తితో కలిసి కల్పన నివసిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కల్పనను స్థానిక ప్రైవేట్ హోలిస్టిక్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
previous post
next post