40.2 C
Hyderabad
April 24, 2024 18: 26 PM
Slider సినిమా

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అరెస్ట్

ఉగాది కూడా న్యూ ఇయర్ లాంటిదే అనుకున్నారో ఏమో కానీ రాత్రంతా తాగుతూ పోలీసులకు పట్టుబడ్డారు కొందరు ప్రబుద్ధులు. ఇలా పట్టుబడ్డ వారిలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నాడు.
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేటి తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. బంజారాహిల్స్ లోని ర్యాడి సన్ బ్లూ హోటల్ పై వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసుల దాడులు జరపడంతో ఈ విషయం బయటకు వచ్చింది. హోటల్ లో ఉన్న ఫుడింగ్ మింగ్ పబ్ అర్దరాత్రి దాటినా సమయానికి మించి పబ్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. యజమానులతో సహా సుమారు 150మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వారిని బంజారాహిల్స్ పీఎస్ కి తరలించారు. రాత్రి 3గం సమయంలో దాడులు నిర్వహించారు. పోలీసు స్టేషన్ లో అరెస్ట్ అయిన యువకులు హంగామా సృష్టించారు. తమను ఎందుకు తీసుకువచారంటూ ఆందోళన చేశారు.

Related posts

నీట్, ఐఐటీ-జేఈఈ 2021 గ్రాండ్ టెస్ట్స్ సిద్ధం

Satyam NEWS

మంత్రి మల్లారెడ్డిపై భూఆక్రమణ కేసు నమోదు!

Sub Editor

నకిలీ అరటి మొక్కలతో రైతుకు నష్టం….

Satyam NEWS

Leave a Comment