22.2 C
Hyderabad
December 10, 2024 11: 09 AM
Slider ముఖ్యంశాలు

ఎర్ర చందనం ఎగుమతికి సింగిల్ విండో విధానం

#pavankalyan

ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఈ వేలం’లో మెరుగైన ఫలితాలు వస్తాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కి తెలియచేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్  బుధవారం ఉదయం భూపేంద్ర యాదవ్ తో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్ నిరోధం, దుంగల అమ్మకం విషయంలో అనుసరిస్తున్న విధానాల మీద కేంద్ర మంత్రితో చర్చించారు. ‘‘బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ప్రతిపాదించిన ప్రకారం ఎర్రచందనం అమ్మకం, ఎగుమతి చేసే విషయంలో సింగిల్ విండో విధానం ఉంటే మేలు జరుగుతుంది. ఈ విధానానికి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ కస్టోడియన్ గా వ్యవహరిస్తుంది. ఈ ప్రతిపాదననను పరిశీలించలరు. ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆధ్వర్యంలో ఎర్రచందనం గ్రేడింగ్, వేలం, ఎగుమతి సాగిస్తుంది.

తద్వారా ఈ-వేలం ద్వారా రెవెన్యూ పెరుగుతుంది. ఎర్రచందనం అరుదైన వృక్ష సంపద. ఆంధ్ర ప్రదేశ్ అటవీ ప్రాంతంలోనే పెరుగుతుంది. ఈ క్రమంలో కేంద్రం నిబంధనలను సవరించి ఆంధ్రప్రదేశ్ వెలుపల పట్టుబడిన ఎర్రచందనం సైతం సింగిల్ విండో వేలంలో భాగం కస్టోడియన్ గా ఉండే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే దక్కేలా చూడాలి. దీనివల్ల ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పట్టుబడిన ఎర్రచందనం అమ్ముకోవడానికి కుదరదు. అమ్మకాలు, ఎగుమతులు ఒకే విధానం ద్వారా కొనసాగుతుంది. కేంద్ర పర్యవేక్షణతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కస్టోడియన్ గా కొనసాగుతుంది’’ అని పవన్ కల్యాణ్ వివరించారు.

Related posts

నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ

Bhavani

ట్యాంక్ బండ్ పై భగీరథుడి విగ్రహం

Satyam NEWS

ల్యాండ్ మాఫియాపై చర్యలు తీసుకొనే వరకు ఉద్యమిస్తాo

Satyam NEWS

Leave a Comment