పీకల్లోతు దాటుకుంటూ వెళ్లి మంచి నీళ్లు తెచ్చుకుంటున్న పీకలగుండం ప్రజలు
ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం పీకలగుండం గ్రామంలో మంచినీటి కోసం ప్రజలు ఇప్పటికీ ప్రాణాలు పణంగా పెట్టి మంచి నీరు తెచ్చుకునే పరిస్థితి గ్రామంలోకి మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో దగ్గర్లో బోర్లు బావులు లేకపోవడంతో సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న కూడా పీకల్లోకి నీరులో నడిచి వెళ్లి మంచినీళ్లు తెచ్చుకునే పరిస్థితి గత పాలనలో హామీలు ఇచ్చారు గాని మాకు సరైన రోడ్లు మంచినీరు సౌకర్యం కల్పించకపోవడంతో నూతనంగా విద్యావంతుడు కష్టాలు తెలిసినవాడు అనుకుని ఎమ్మెల్యేగా గెలిపించాం అయినా కూడా మా పరిస్థితులు అలానే ఉన్నాయని పీకలగుండం గ్రామస్తులు వాపోయారు.
ఎవరైనా మంచినీళ్ల కోసం వాగులోకి వెళ్లి మరణించినచో నాయకులే బాధ్యత వహించాలని ఓట్ల కోసం కాకుండా ప్రజల కష్టాలను కన్నీళ్లను పట్టించుకోవాలని గ్రామాలలో ఉన్న ఇబ్బందులు తెలుసుకోవాలని నాయకులను అధికారులు పట్టించుకోని మాకు సరైన మంచినీటి వసతిని ఏర్పాటు చేపియాలని రోడ్లు మరమ్మతులు చేపియాలని కోరుకుంటున్నారు.