సీపీఐ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆగస్టు-19న ఎయిమ్స్‌లో చేరిన ఏచూరి సాయంత్రం మరణించారు. సీతారం మరణంతో కమ్యూనిస్ట్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఏచూరి మరణంతో ఆయన అభిమానులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆస్పత్రిలో చేరినప్పట్నుంచి వెంటిలేటర్‌పైనే సీతారాం ఏచూరికి వెంటిలేటర్‌పైనే వైద్యులు చికిత్స అందించారు. ఆయనను కాపాడాలని వైద్యులు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డాక్టర్ గౌరి నేతృత్వంలో వివిధ విభాగాలకు చెందిన వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించింది. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ తొలగించేందుకు ఉపయోగించిన మందులు పనిచేయకపోవడంతో జపాన్ నుంచి కూడా ప్రత్యేక మందులు తెప్పించి వైద్యం చేసినట్లుగా తెలుస్తోంది.
previous post