27.7 C
Hyderabad
April 20, 2024 00: 33 AM
Slider ముఖ్యంశాలు

టీఎస్ పీసెట్-2021 కి సాంకేతిక అధికారిగా ఎంపికైన శివకుమార్

#tspect

తెలంగాణా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం  నిర్వహిస్తున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కి సాంకేతిక అధికారిగా బాధ్యతలు నిర్వహించేందుకు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల  తాళ్ళ నరసింహాపురం గ్రామానికి చెందిన కోళ్ల శివకుమార్ ఎంపికైనట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలా పోగుల స్వాములు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగే టీఎస్ పీసెట్ -2021 కి శివకుమార్ సాంకేతిక అధికారిగా ఎన్నిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ అందుకు కారణమైన తన గురువు, నాగర్ కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి  డాక్టర్ సోలపోగుల స్వాములుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పీసెట్-2021 కు  సాంకేతిక అధికారిగా ఎంపిక చేసిన తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్టాన్లీ జోన్స్, ప్రధాన కార్యదర్శి సారంగపాణి లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

సాంకేతిక అధికారిగా ఎంపిక కావడం పట్ల జిల్లా యువజన క్రీడల అధికారి హనుమంతు నాయక్ ,అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములు,ఇతర సభ్యులు విజయ్,లావణ్య రెడ్డి ,లక్ష్మి ,శ్రీకాంత్, శేఖర్ లతో పాటు మాజీ క్రీడాకారులు క్రీడాభిమానులు గ్రామస్తులు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

Related posts

ములుగు ఎస్ పిని కలిసిన పరస సబ్ ఇన్స్పెక్టర్

Satyam NEWS

ఏపి రోడ్లపై తెలంగాణ మంత్రి దారుణ వ్యాఖ్యలు

Bhavani

కర్ఫ్యూ సడలింపు: నిబంధనల అమలుపై సడలిన ఖాకీలు..!

Satyam NEWS

Leave a Comment