30.7 C
Hyderabad
April 24, 2024 00: 24 AM
Slider ఆదిలాబాద్

ఆరుగురు ఐటి/ కమ్యూనికేషన్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతులు

#policeadilabad

అదిలాబాద్ జిల్లా పోలీసు శాఖలో ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో పనిచేస్తున్న ఆరుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతులు లభించాయి. రాష్ట్ర టెక్నికల్ సర్వీస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన జి స్వాతి, టి. రాజు,  కే మహేష్ ఆర్.రాజేంద్ర ప్రసాద్ ,ఎం రమేష్ కుమార్, ఏం. శ్రీకాంత్ లు శనివారం జిల్లా ఎస్ పి ఎం.రాజేష్ చంద్ర ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

వారికి  మిఠాయిలు తినిపించి  అభినందించిన ఎస్పీ వారికి పదోన్నతి స్టార్లను అలంకరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న సమాచార రంగంలో ఐటీ/ కమ్యూనికేషన్ వ్యవస్థ కీలకమని, పోలీస్ వీధుల్లో భాగస్వామ్యం అయిందన్నారు.  ఉద్యోగంలో చేరిన మూడు సంవత్సరాల్లోనే పదోన్నతులు రావడం అత్యంత శుభ పరిణామమన్నారు.

పదోన్నతుల తో బాధ్యతలు మరింత పెంచుకోవాలని, సమాచార రంగంలో మరింత అభివృద్ధి సాధించాలని సూచించారు. వీడియో/టెలి కాన్ఫరెన్స్ సమావేశంలో ఎలాంటి ఆటంకం లేకుండా స్పష్టంగా వీక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

బందోబస్తు, పెట్రోలింగ్, ట్రాఫిక్ విధులలో కమ్యూనికేషన్ హ్యాండ్ సెట్లు ప్రధాన పాత్ర పోశిస్తాయన్నారు .ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ గుమ్మడి మల్లేష్, ఎస్సై సయ్యద్ అన్వర్ ఉల్ హక్, ఐటీ కమ్యూనికేషన్ ఎస్సై పి.గణేష్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, క్యాంపు కార్యనిర్వాహణాధికారి దుర్గం శ్రీనివాస్, ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత, తదితరులు పాల్గొన్నారు.

Related posts

హాకీ టోర్నమెంట్లో తెలంగాణ మహిళలు సత్తా చాటాలి

Satyam NEWS

అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి

Satyam NEWS

USFI జాతీయ కన్వీనింగ్ కమిటీ కార్యవర్గ సభ్యునిగా పరశురాం

Satyam NEWS

Leave a Comment