40.2 C
Hyderabad
April 24, 2024 17: 16 PM
Slider నల్గొండ

రహదారి అభివృద్ధికి అందరూ సహకరించాలి

#CITUCHujurnagar

మెయిన్ రోడ్ డెవలప్మెంట్ చేసే విషయంలో రోడ్ల పక్కన వీధి వ్యాపారం చేసే వారు మున్సిపల్ అధికారులకు సహకరించాలని  సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కార్మికులని కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఫ్లవర్స్ అసోసియేషన్ కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో పాల్గొన్న రోషపతి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా వ్యాపారం చేసుకునే వారికి ఆర్థికంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి నెలకి 7,500 రూపాయలు చొప్పున  పది నెలలు  ఇవ్వాలని, ఉచిత రేషన్ ఇవ్వాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వీధి వ్యాపారులకి బ్యాంకుల ద్వారా ఋణాలు ఇచ్చే స్కీమ్ చిరు వ్యాపారులందరికీ వర్తించే విధంగా చూడాలని కోరారు. ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుని జీవించే వారికి మెయిన్ రోడ్డు డెవలప్ చేసిన పిదప ఎవరి స్థానం వారికి ఇవ్వాలని  అన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు యం.కనకయ్య, జి. వెంకన్న, ఫ్లవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెడపంగు రాజేష్ కిరణ్, రంగయ్య, చింతకాయల వీరమ్మ, ఉమ, నరసింహారావు,తదితరులు పాల్గొన్నారు.

Related posts

సంగీత క‌ళా న‌గ‌రంలో ల‌తామంగేష్క‌ర్ అవార్డు గ్ర‌హీత‌చే హిందుస్థానీ క‌చేరీ

Satyam NEWS

ప్రజలు స్వీయ నిర్భందాన్ని కచ్చితంగా పాటించాలి

Satyam NEWS

హైదరాబాద్ ఐటీ పరిశ్రమకు ఢోకాలేదు

Satyam NEWS

Leave a Comment